టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తన లేటెస్ట్ మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ మూవీపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ క్రమంలో సమంత ట్విటర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. శాకుంతలం సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే నటి మృణాల్ ఠాకూర్ అడిగిన దానికి కూడా సమంత ఆన్సర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టులను సామ్ ట్విటర్‌లో పంచుకుంది. అసలు నెటిజన్లు సామ్‌ను ఏం అడిగారు?. అందుకు సమంత ఇచ్చి క్రేజీ ఆన్సర్స్ ఏంటీ? ఇప్పుడు చూద్దాం.
మృణాల్ ఠాకూర్: శాకుంతలం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా. నువ్వు చాలా ఇన్‌స్పైరింగ్. నా ప్రశ్న ఏంటంటే మనం కలిసి ఎప్పుడు సినిమా చేయబోతున్నాం?
సామ్: కాంగ్రాట్యూలేషన్స్…. ‘గుమ్రా’ బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్. నీ ఆలోచన చాలా నచ్చింది. మనం చేద్దాం.
నెటిజన్: మీ నిజమైన అభిమాని కోసం ఒక్క మాటలో ఏం చెబుతారు?
సామ్: నిన్నటి వరకు స్ట్రేంజర్.. ఇవాళ కుటుంబ సభ్యుడు
నెటిజన్: మీకు ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది? ఎన్నో సమస్యలు ఉన్నా మీరు ఎలా మూవ్ ఆన్ అవుతున్నారు.
సామ్: ఎందుకంటే నా కథ ఎలా ముగియాలో నేను నిర్ణయిస్తాను కాబట్టి.
నెటిజన్: మీరు శాకుంతలం రిలీజ్ రోజు ఫ్యాన్స్ షో చూసేందుకు దేవి 70MM థియేటర్‌కు వస్తారా?
సామ్: రావొచ్చేమో? రావాలా..!
నెటిజన్: శాకుంతలం, ఖుషి, బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో శామ్ ఎంటర్‌టైన్‌మెంట్ మాముల్గా ఉండదు
సామ్: ఈ ఏడాది కూడా చాలా క్రేజీగా గడవబోతోంది.
నెటిజన్ : నువ్వు టీనేజ్ అమ్మాయిగా ఎంతో క్యూట్‌గా ఉన్నావు. ఈ లుక్‌ను ఇలాగే కొంత కాలం కొనసాగించాలని భావిస్తున్నారా?
సామ్: గ్లాసెస్.. నా కొత్త బెస్ట్ ఫ్రెండ్
నెటిజన్: మీ ఉద్దేశంలో ఆత్మగౌరవం, సెల్ఫ్ లవ్ అంటే ఏంటి?
సామ్ : మీ గురించి తెలుసుకోవడానికి ఇతరులపై ఆధారపడనప్పుడు..మీరు మీతోనే సంతోషంగా ఉండగలిగినప్పుడు..
నెజిజన్: మీరు వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో జయపజయాలను ఎలా తీసుకుంటారు. మీ హార్ట్ అండ్ మైండ్‌లో ఎమోషన్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు?
సామ్: విజయాల కంటే అపజయాలే మీకు ఎక్కువ గుణపాఠాలు నేర్పుతాయి. ఓటములే మిమ్మల్ని మంచి వ్యక్తిగా మారుస్తాయి.
నెటిజన్ : మీరు ఓ బేబి సినిమా అప్పుడు నాకు రిప్లై ఇచ్చారు. అది హిట్ అయింది. ఇప్పుడు కూడా ఒక రిప్లై ఇవ్వండి.. శాకుంతలం బ్లాక్ బస్టర్ అవుద్ది.
సామ్: వామ్మో… అలాంటప్పుడు నీతో గొడవ పెట్టుకోకూడదు(నవ్వుతూ)
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం