• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్‌లో ‘పవర్’ సునామీ

    పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’ మూవీ టీజర్ అదరగొడుతోంది. నిన్న సాయంత్రం ఈ టీజర్‌ని విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అప్పుడే 10మిలియన్లకు పైగా వ్యూస్‌ని దక్కించుకుంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్స్ మాటలు అందించారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. జులై 28న మూవీ విడుదల కానుంది.

    గవర్నర్‌ని ప్రశ్నిస్తూ వెలిసిన పోస్టర్లు

    తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. ఆ రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, గవర్నర్‌ని ప్రశ్నిస్తూ రాష్ట్రంలో పోస్టర్లు వెలిశాయి. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం సమీపంలో పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అంటించారు. నేర చరిత్ర కలిగిన కేంద్ర మంత్రుల జాబితాను ఇందులో ప్రచురించడం గమనార్హం. గవర్నర్ ఆర్.ఎన్.రవిని ప్రశ్నిస్తూ వీటిపై సమాధానమేంటని పోస్టర్లలో నిలదీశారు. #WATCH | Tamil Nadu: DMK supporters stick posters near Anna Arivalayam, DMK headquarters in Chennai, raising … Read more

    లబుషేనా.. ఏంటీ నువ్ చేసిన పని!

    ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆశ్చర్యకర దృష్యాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో టెస్టు తొలి రోజున నిరసనకారులను బెయిర్‌స్టో అమాంతం ఎత్తుకెళ్లిన ఘటనను మరవకముందే మరో దృష్యం చోటు చేసుకుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ సమయంలో జట్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ వికారం పుట్టించే పనిచేశాడు. నోటి నుంచి భూమిపై ఊడిపడ్డ చూయింగ్ గమ్‌ని తిరిగి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Marnus dropping his gum on the pitch and then … Read more

    ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఫ్యాన్స్ హంగామా

    పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ మూవీని 4K వెర్షన్‌లో నేడు రీరిలీజ్ చేశారు. ఈ సందర్బంగా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు. సింగిల్ స్క్రీన్ మాదిరి స్క్రీన్ వద్దకి వెళ్లి డ్యాన్స్ చేశారు. తొలిప్రేమ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీని రీరిలీజ్ చేశారు. అప్పట్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ చాలామందికి ఫేవరేట్ మూవీ ఇది. #TholiPrema4K IN CINEMAS NOW? Multiplexes turned into Single Screens … Read more

    ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మోదీ

    ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ మెట్రోల పర్యటించారు. స్వయంగా టికెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కారు. అయితే, మోదీ రాక సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ విధించిన నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. కార్యక్రమానికి నల్ల దుస్తులు వేసుకు రావొద్దని, కచ్చితంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. #WATCH | Prime Minister Narendra Modi travels by metro to attend centenary … Read more

    ‘మూర్ఖుడి’గా మారనున్న అల్లరి నరేష్

    ఉగ్రం తరువాత అల్లరి నరేష్ సరికొత్త కథతో రాబోతున్నాడు. N62 వర్కింగ్ టైటిల్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మూర్ఖత్వం హద్దులు దాటిన వ్యక్తి జీవిత కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సుబ్బు ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. రాజేశ్ దండా, బాలాజీ గుట్ట నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్‌మెంట్ వీడియోని రిలీజ్ చేశారు.

    ఇంత భారీ క్యాచ్ ఎవరూ పట్టరేమో?

    ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో చేసిన పని క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆసీస్‌తో రెండో టెస్టు ప్రారంభమైన కొద్ది సేపటికి కొందరు నిరసనకారులు మైదానంలోకి దూసుకొచ్చారు. ఆరెంజ్ పౌడర్ చల్లి తమ నిరసన తెలిపారు. దీంతో వికెట్ కీపింగ్ చేస్తున్న బెయిర్‌స్టో ఓ నిరసన కారుడిని అమాంతం ఎత్తుకుని మైదానం అవతలికి తీసుకెళ్లాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. భలే క్యాచ్ పట్టాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. స్పిన్నర్ అశ్విన్ సైతం దీనిపై స్పందించాడు. Jonny Bairstow man handling … Read more

    ‘కీడాకోలా’ టీజర్ వచ్చేసింది

    తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘కీడా కోలా’ మూవీ టీజర్ విడుదలైంది. క్రైమ్, కామెడీ చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇప్పటికే పాత్రలను పరిచయం చేసిన మూవీ టీం ఇప్పుడు టీజర్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది. బ్రహ్మానందం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. విచిత్రమైన క్యారెక్టర్లు కలిగిన వ్యక్తులు అంతా ఒకచోట కలిస్తే ఎలా ఉంటుందనేది ఈ మూవీలో చూడొచ్చని చిత్రబృందం చెబుతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.

    మళ్ళీ తెరపైకి విజయ్, రష్మిక లవ్..!

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌లో ఉన్నారన్న పుకార్లు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా వీటికి బలం చేకూర్చేలా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా కనిపించడంతో నిజమేనని అనుకుంటున్నారు. ఓ హోటల్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి భోజనం చేస్తున్నట్లు వీడియోని చూస్తే తెలిసిపోతుంది. అయితే, వీరిద్దరికీ మనస్ఫర్దలు వచ్చాయని, ఆ తర్వాత ప్యాచప్ అయినట్లు నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. #vijaydevarakonda #RashmikaMandanna #Rashmika pic.twitter.com/NdbfNfsETp — News Bazaar (@NewsBazaar4) June 24, 2023 Courtesy … Read more

    కంగన ‘ఎమర్జెన్సీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

    కంగన రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 24న సినిమాని రిలీజ్ చేయనున్నారు. భారత దేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ. 1975 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించింది కంగన. ఇందిర పాత్రలో కంగన నటించింది. ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఇందుకు దారితీసిన పరిణామాలను ఇందులో చూపించే అవకాశం ఉంది.