• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిపోర్టర్‌గా మారిన రోహిత్ శర్మ

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిపోర్టర్‌గా మారారు. వైస్ కెప్టెన్ అజింక్య రహానెని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాడు. ‘వెస్టిండీస్‌లో ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్‌గా నువ్వు యంగ్ ప్లేయర్లకు ఎలాంటి సలహాలు ఇస్తావు’ అని రోహిత్ అడిగాడు. ‘ఒక్కటే చెప్పేది.. కుర్రాళ్లకు ఓపిక తప్పనిసరి. క్రీజులో ఉన్నప్పుడు సహనంతో ఉండాలి’ అని అజింక్య చెప్పాడు. రేపటి నుంచి వెస్టిండీస్‌తో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ?? ??? ????! When #TeamIndia Captain @ImRo45 … Read more

    కాలనీలను ముంచెత్తిన బురద

    హిమాచల్ ప్రదేశ్ మండిలో వరద బీభత్సం సృష్టించింది. చెట్ల దుంగలు, బురద కాలనీలను ముంచెత్తాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సీఎం సుక్విందర్ సింగ్ సుఖు కోరారు. రానున్న 24 గంటల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. అత్యవసరమైతే ప్రజలు 1100, 1070, 1077 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. #WATCH | Mandi, Himachal Pradesh | Cloud burst in Thunag causes flash … Read more

    ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు, వరదలు

    భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌లో నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. చీనాబ్, యమున, బియాస్ నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలు, వరదల కారణంగా 19 మంది మరణించారు. చాలా మంది వరదల్లో చిక్కుకుపోయి సహాయం కోసం అర్థిస్తున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ వానలు ఆగట్లేదు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. #WATCH | Under the impact of incessant rainfall in Himachal Pradesh, Lagghati … Read more

    బ్యాలెట్ బాక్సులో నీళ్లు.. పోలింగ్ నిలిపివేత

    పశ్చిమబెంగాల్‌ పంచాయతీ ఎన్నికల పోలింగులో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. ఘర్షణలతో పాటు పోలింగ్ ప్రక్రియను కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాలెట్ పెట్టెలను ధ్వంసం చేస్తున్నారు. దిన్‌హాటాలోని ఇంద్రేశ్వర్ ప్రైమరీ పాఠశాలలోని బ్యాలెట్ బాక్సులో కొందరు నీళ్లు పోశారు. దీంతో పోలింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మరోచోట, బ్యాలెట్ బాక్సును తగలబెట్టారు. ఇలా పోలింగ్ ప్రక్రియకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతుండటం అధికారులకు తలనొప్పిగా మారింది. #WATCH | West Bengal panchayat election | Ballot box at a polling … Read more

    బ్యాలెట్ బాక్స్‌ని తగలబెట్టిన ఓటర్లు

    పంచాయతీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో అల్లకల్లోలం జరుగుతోంది. పార్టీల నేతల మధ్య జరిగిన ఘర్షణల్లో 9 మంది మృతి చెందారు. మరోవైపు, కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హాటాలోని బరానచిరా పోలింగ్ కేంద్రంలో ఓటర్లు భగ్గుమన్నారు. బోగస్ ఓటింగ్ జరుగుతుందన్న ఆరోపణలతో బ్యాలెట్ బాక్స్‌ని తగలబెట్టారు. పోలింగ్ కేంద్రం నుంచి పెట్టెను బయటికి తీసుకొచ్చి నిప్పంటించారు. ఘర్షణలపై టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. #WATCH | West Bengal panchayat election | Ballot box at a polling … Read more

    సలార్ టీజర్‌కి రికార్డ్ వ్యూస్

    ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ టీజర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 100మిలియన్ల(10 కోట్లు) వ్యూస్‌ని దక్కించుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అభిమానుల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చిత్రబృందం ఫిదా అయింది. ఈ చిత్రం ట్రైలర్ ఆగస్టులో విడుదల చేయనున్నట్లు టాక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

    త్రిపుర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. సభలో ఉండగా బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియోలు చూడటంతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీల సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోడియం ముందుకొచ్చి ఒకరినొకరు తోసుకున్నారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మార్చిలో బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియోలు చూడటం వైరల్ అయింది. ఫోన్ కాల్ మాట్లాడుతుంటే పొరపాటున వచ్చినట్లు సదరు ఎమ్మెల్యే వివరణ ఇవ్వడం గమనార్హం. #WATCH | Agartala | … Read more

    భార్య లేని పీఎం ఉండొద్దు: లాలూ

    బిహార్ ఆర్జేడీ పార్టీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య లేని వారు ప్రధాని నివాసంలో ఉండటం తప్పని చెప్పారు. ప్రధాని అయ్యే వ్యక్తులకు తప్పనిసరిగా శ్రీమతి ఉండాలని లాలూ వ్యాఖ్యానించారు. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా సమావేశంలో పెళ్లి చేసుకోవాలని రాహుల్ గాంధీకి లాలూ సూచించడం వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. అర్ధాంగి లేకుండా పీఎం నివాసంలో ఉండే సంప్రదాయాన్ని వచ్చే ఎన్నికల్లో 300 సీట్లతో కడిగేస్తామని ఆయన చెప్పారు. … Read more

    రూ.999కే జియో భారత్ 4G ఫోన్

    రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరదీసింది. రూ.999కే 4G భారత్ ఫోన్‌ని అందించనుంది. 2G యూజర్లను 4Gలోకి మార్చడమే ధ్యేయంగా జియో ఈ ప్రకటన చేసింది. కార్బన్ కంపెనీ ఈ ఫోన్‌ని తయారు చేయనుంది. 1000mAh బ్యాటరీతో యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా ఫోన్‌ని తీర్చిదిద్దనున్నారు. జియో సినిమా, జియో సావన్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ డీఫాల్ట్‌గా రానున్నాయి. ఈ ఫోన్‌కి నెలకు రూ.123తో రీఛార్జి చేస్తే ప్రతిరోజు 0.5జీబీ డేటా, అపరిమిత కాల్స్ వినియోగించుకోవచ్చు.

    రేవంత్, వెంకటరెడ్డిల మధ్య దూరం తగ్గలేదా?

    TS: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగిపోలేనట్లు తెలుస్తోంది. గతంలో వీరు చేతులు కలిపినా లోలోపల కుమ్ములాటలు ఉన్నట్లు సమాచారం. నేడు ఖమ్మంలో కాంగ్రెస్ సభ జరగనున్న క్రమంలో వెంకటరెడ్డి సోషల్ మీడియా హ్యాండిల్‌లో చేసిన పోస్టు వీటిని బలపరుస్తోంది. రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ డిజైన్ చేసిన పోస్టర్‌లో, అంతకుముందు వాటిల్లో రేవంత్ రెడ్డి ఫొటో లేదు. ప్రొటోకాల్ ప్రకారం పెట్టాల్సిందని పలువురు సూచిస్తున్నారు. ఛలో ఖమ్మం తెలంగాణ ప్రజల బానిస సంకెళ్లు తెంచడానికి.. … Read more