హిమాచల్ ప్రదేశ్ మండిలో వరద బీభత్సం సృష్టించింది. చెట్ల దుంగలు, బురద కాలనీలను ముంచెత్తాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సీఎం సుక్విందర్ సింగ్ సుఖు కోరారు. రానున్న 24 గంటల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. అత్యవసరమైతే ప్రజలు 1100, 1070, 1077 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు.
-
Courtesy Twitter:@ANI
-
Courtesy Twitter:@ANI