• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిమాచల్‌లో వరద బీభత్సం

    హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టించింది. తాజాగా కొండచరియ విరిగిపడటంతో భవనాలు కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాల క్రింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారిని కాపాడటం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగాయి. కులు-మండీ హైవేపై వందలాది వాహనాలు చిక్కుకున్నాయి. ఈ ఘటనపై సీఎం సుఖ్విందర్ సింగ్, పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. An important update coming from Kullu district, Himachal Pradesh. Amidst the ongoing challenges, a fresh landslide in … Read more

    24 గంటల్లో 50 మంది మృతి

    హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతర వర్షాల కారణంగా గత 24 గంటల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. శిథిలాల కింద 20 మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం లేదని సీఎం అన్నారు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, కాంగ్రెస్‌ – భాజపా అధ్యక్షులు తమ ప్రభుత్వానికి సాయం చేయాలని కోరారు. Massive devastation due … Read more

    మనాలిలో వరద బీభత్సం

    హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 12కు పైగా బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 80 మందికి పైగా మృతి చెందారు. మనాలిలో వరద బీభత్సం సృష్టించింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదతో కొట్టుకు వచ్చిన వ్యర్థాలతో పరిసరాలు నిండిపోయాయి. రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నందున పరిస్థితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. #WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh … Read more

    కాలనీలను ముంచెత్తిన బురద

    హిమాచల్ ప్రదేశ్ మండిలో వరద బీభత్సం సృష్టించింది. చెట్ల దుంగలు, బురద కాలనీలను ముంచెత్తాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సీఎం సుక్విందర్ సింగ్ సుఖు కోరారు. రానున్న 24 గంటల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. అత్యవసరమైతే ప్రజలు 1100, 1070, 1077 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. #WATCH | Mandi, Himachal Pradesh | Cloud burst in Thunag causes flash … Read more

    ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు, వరదలు

    భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌లో నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. చీనాబ్, యమున, బియాస్ నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలు, వరదల కారణంగా 19 మంది మరణించారు. చాలా మంది వరదల్లో చిక్కుకుపోయి సహాయం కోసం అర్థిస్తున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ వానలు ఆగట్లేదు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. #WATCH | Under the impact of incessant rainfall in Himachal Pradesh, Lagghati … Read more

    హిమాచల్‌లో పోటెత్తిన వరదలు

    హిమాచల్‌ ప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. దీంతో బాగిపుల్ ప్రాంతంలో పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. చంబా నుండి వచ్చిన విద్యార్థుల బస్సు పరాశర్ నుండి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డీఎస్పీ సూద్ వెల్లడించారు. Damage reported in #Seraj Valley due to Flash Flood#HimachalPradesh #Monsoon pic.twitter.com/AJc4RQEqdX … Read more

    కొండల్లో గుబులు పుట్టించే మంచు చిరుతలు

    [VIDEO:](url) పర్వతాల్లో ప్రమాదకరమైన జంతువుల్లో ఒకటైన మంచు చిరుతలు హిమాచల్ ప్రదేశ్ కొండల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కొండ నీడకు తల్లి చిరుత సేద తీరుతుంటే పిల్ల చిరుతలు ఆ కొండల్లో చక్కర్లు కొడుతున్నాయి. తల్లి చిరుత పిలుపు విని వడివడిగా అమ్మ దగ్గరికి చేరుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. పర్వీన్ కస్వాన్ అనే ఐఏఎస్ అధికారి ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. మంచు చిరుతలు గర్జించవు. వాలుగా ఉన్న కొండలు ఎక్కడంలో ఇవి దిట్ట. ప్రత్యేకంగా ఉన్న … Read more

    గడ్డకట్టిన కులూ జలపాతం; పిక్స్ వైరల్

    హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ[ జలపాతం](url) గడ్డ కట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డ కట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వెల్లువలా వస్తున్నారు. కాగా హిమాలయాల చెంతనే ఉండటంతో హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. తాగే మంచినీరు కూడా గడ్డ కట్టుకుపోతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. On #Udaipur – #Tindi road… Near Bhim bagh ? 7th January 2023#Lahaul , #HimachalPradesh@SkymetWeather @jnmet @Mpalawat … Read more

    ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు

    ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరదలు పొటెత్తున్నాయి. వరదల ధాటికి హిమాచల్ ప్రదేశ్‌-కంగ్రా జిల్లాలోని చక్కీ రైల్వే బ్రిడ్జి ఉదయం కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నార్తన్ రైల్వే ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. అటు ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు నీట మునిగాయి. నిత్యవసరాలు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరదలను చూసేందుకు WATCH ONపై క్లిక్ చేయండి. … Read more

    పొటేత్తిన వరద..ఇద్దరు గల్లంతు

    హిమాచల్ ప్రదేశ్ కులులోని సోలాంగ్ నాలాలో ఒక్కసారిగా వరద పొటేత్తింది. దీంతో నీటి ప్రవాహానికి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. నిన్న వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం, రాత్రి కారణంగా రెస్క్యూ పనిని నిలిపివేశారు. ఇవాళ మళ్లీ వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. #WATCH | Himachal Pradesh: Two people missing after flash floods in Solang Nala, Kullu yesterday. Search and rescue operations, that stopped due to the increase of water flow in … Read more