ఊపేస్తున్న వీరసింహారెడ్డి ఐటెమ్ సాంగ్
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయె’ అంటూ సాగుతున్న ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. తమన్ స్వరాలను సమకూర్చారు. సాహితీ, సత్య యామిని, రేణు కుమార్ కలిసి పాటను ఆలపించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జనవరి 12న విడుదల కానుంది.