• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 101మీటర్ల సిక్సర్ బాదిన బౌలర్

    బంగ్లాతో తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్సులో 404 పరుగులు చేసి ఆలౌటైన ఇండియా.. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. రెండో రోజు 8 వికెట్లను తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టేసింది. అయితే, ఓవర్‌నైట్ స్కోరు 278/6తో మొదలు పెట్టిన ఇండియా 393 వద్ద 9 వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ విరుచుకుపడ్డాడు. మెహిదీ హసన్ బౌలింగులో 101మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. దీంతో ఉమేశ్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు … Read more

    తమిళనాడులో ప్రమాదం.. వీడియో వైరల్

    తమిళనాడు తూత్తుకూడిలో చోటు చేసుకున్న ఓ ప్రమాదం నెట్టింట వైరల్ అవుతోంది. లారీ ఎదురుగా వస్తుండగా మెడకు తాడు తట్టుకుని బైకర్ అమాంతంగా వెనక్కి ఎగిరి పడ్డాడు. అదృష్ట వశాత్తు ఈ ఘటనలో బైకర్ ముత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే, లోడు కిందకి జారుతున్నా పట్టించుకోకుండా డ్రైవర్ దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీకి కట్టిన తాడు ఊడిపోవడంతో ముత్తు మెడకు చుట్టుకుంది. రెప్పపాటులో సంభవించిన ఈ ప్రమాదాన్ని చూసి నెటిజన్లు జంకుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని … Read more

    101మీటర్ల సిక్సర్ బాదిన బౌలర్

    బంగ్లాతో తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్సులో 404 పరుగులు చేసి ఆలౌటైన ఇండియా.. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. రెండో రోజు 8 వికెట్లను తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టేసింది. అయితే, ఓవర్‌నైట్ స్కోరు 278/6తో మొదలు పెట్టిన ఇండియా 393 వద్ద 9 వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ విరుచుకుపడ్డాడు. మెహిదీ హసన్ బౌలింగులో 101మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. దీంతో ఉమేశ్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు … Read more

    గోపీచంద్‌ని ఆటపట్టించిన ప్రభాస్

    బాలయ్య అన్‌స్టాపబుల్ షో సీజన్ 2 లో ప్రభాస్-గోపీచంద్ ఎపిసోడ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆహా గోపీచంద్‌కి చెందిన గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో గోపీచంద్ సరదాగా కనిపించారు. ‘2008లో కాదు సర్..’ అని గోపీచంద్ అంటుంటే.. ‘రేయ్..’ అని ప్రభాస్ అనడంతో నవ్వులు పూచాయి. అనంతరం గోపీ‌చంద్‌ని ప్రభాస్ ఆటపట్టిస్తుంటే బాలయ్య మధ్యలో నిలుచుండటం వంటివాటితో గ్లింప్స్ సరదాగా సాగిపోయింది. వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్‌కు సంబంధించిన ప్రోమోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

    రవితేజ ‘ధమాకా’ ట్రైలర్ విడుదల

    రవితేజ డ్యుయల్ రోల్‌లో నటిస్తున్న ‘ధమాకా’ ట్రైలర్ విడుదలైంది. రెండు క్యారెక్టర్లలో రవితేజ ఒదిగిపోయాడు. మాస్ మహారాజ కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తోంది. ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్తగా ఒక పాత్రలో.. ఉద్యోగం కోసం ఎదురు చూసే యువకుడిగా రవితేజ అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపైకి వచ్చిన తర్వాత ఏం జరిగబోతోందనే సస్పెన్స్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా శ్రీలల మరోసారి అలరించింది. కాగా, ఈ సినిమాను త్రినాథరావు నక్కిన తెరకెక్కించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

    కడప దర్గాను సందర్శించిన తలైవా

    సూపర్ స్టార్ రజినీకాంత్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దర్శనీయ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతిలో పూర్తయ్యాక కడపలోని అమిన్ దర్గాకు చేరుకున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ కూడా తలైవాతో ఉన్నారు. దర్గాకు వచ్చిన రజినీకి నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజినీ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం … Read more

    రూ.12 కోట్ల కారు కొన్న హైదరాబాద్ వాసి

    రూ.12కోట్ల విలువైన కారును హైదరాబాద్ వాసి కొనుగోలు చేశారు. ఖరీదైన కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్.. భారత్‌లోనూ డీలర్‌షిప్‌ని ప్రారంభించింది. ముంబైలో ప్రారంభం అనంతరం తొలి కస్టమర్‌కు ‘మెక్‌లారెన్ 765ఎల్టీ స్పైడర్’ మోడల్ కారును పంపిణీ చేసింది. హైదరాబాద్‌కి చెందిన వ్యాపారవేత్త నసీమ్ ఖాన్ ఈ కారును కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు ధర సుమారు రూ.12కోట్లు ఉంటుందని అంచనా. కారు డెలీవరీ తీసుకోవడం చాలా సంతోషకరమని నసీమ్ ఖాన్ ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు. కారుకు సంబంధించిన వీడియోను ఆయన అందులో పంచుకున్నారు. … Read more

    20 గుంజీలు తీస్తే ఉచిత ప్రయాణం

    ఐరోపా దేశమైన రొమేనియా పౌరుల ఆరోగ్య సంరక్షణపై వినూత్న ఆలోచన చేసింది. 20 గుంజీలు తీస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఇలా వచ్చిన టికెట్‌ని హెల్త్ టికెట్‌గా వ్యవహరిస్తుంటారు. స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని ఆ దేశం నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఇలా టికెట్ మంజూరు చేసే మిషన్‌లను ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ముందు నిలబడి 20 గుంజీలు తీస్తే.. టికెట్ వచ్చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను … Read more

    ఏం చెబుతున్నావ్ డార్లింగ్: ప్రభాస్

    బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీజన్2లో ప్రభాస్, గోపీచంద్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా మీడియా గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో ఓ సెలబ్రిటీతో మాట్లాడుతూ.. ‘ఏయ్.. ఏం చెబుతున్నావ్, డార్లింగ్’ అంటూ ప్రభాస్ వారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చిన్న గ్లింప్స్ మాత్రమేనని.. అసలైన ప్రోమోను త్వరలో విడుదల చేస్తామని ఆహా ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్ లేదా క్రిస్టమస్‌కి ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ … Read more

    ప్యాంటులో మూత్రం పోసుకున్న అధ్యక్షుడు

    వృద్ధాప్యం కారణంగా దక్షిణ సూడాన్ అధ్యక్షుడు సాల్వా కిర్ మయర్దత్(71) అభాసుపాలయ్యారు. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సాల్వా.. అసంకల్పితంగా మూత్ర విసర్జన చేశారు. ఈ తతంగం అంతా కెమెరాలో రికార్డు కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. గత కొంత కాలంగా అధ్యక్షుడు మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆయనకు ఇలా జరిగి ఉంటుందని తెలుస్తోంది. మూత్రం పోసుకున్నట్లు తొలుత అధ్యక్షుడికి తెలియలేదని.. చర్మ స్పర్శ ద్వారా ఆయన తెలుసుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారిక కార్యక్రమంలో ఇలా జరగడంతో ప్రపంచవ్యాప్తంగా … Read more