• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐఫోన్ 15 అమ్మలేదని సిబ్బందిపై దాడి

    ఐఫోన్ 15పై ఉన్న క్రేజ్ కొట్లాటకు దారి తీసింది. స్టోర్ సిబ్బందిని ఐఫోన్ ప్రియులు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని క్రోమా స్టోర్‌లో జరిగింది. ఐఫోన్ 15 ప్రో మొబైల్‌ను అమ్మడం కుదరదు అన్నందుకు క్రోమా సిబ్బందిపై దాడి చేసినట్లు తెలిసింది. దీనిపై క్రోమా స్టోర్ స్పందిస్తూ.. స్టాక్ లేకపోవడం వల్లే అమ్మడం లేదని చెప్పుకొచ్చింది. సిబ్బందిపై దాడి చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. https://x.com/TeluguScribe/status/1705484270578655478?s=20

    క్షమాపణలు చెప్పిన పోలీస్ జంట

    సోషల్ మీడియాలో తమ ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ కావడంపై సీపీ ఆనంద్‌కు లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత వేడుకల్లో యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ ఆనంద్ అన్నారు. కొత్త దంపతులు జీవితకాలం ప్రేమతో కలిసి ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. పంజాగుట్ట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ చేసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్‌లో యూనిఫాం, ప్రభుత్వ వాహనాలు వాడటంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. https://x.com/fpjindia/status/1703795784997822685?s=20

    భారత్‌లో ఐఫోన్ 15 అమ్మకాలు షురూ

    ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు భారత్‌లో ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఐఫోన్లు కొనుగోలు చేసేందుకు తెల్లవారుజాము నుంచే యాపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ముంబైలోని బీకేసీ, ఢిల్లీలోని సాకేత్ స్టోర్ల వద్ద సందడి నెలకొంది. ఐఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 12 కాలీఫోర్నియాలోని యాపిల్ హెడ్‌క్వార్టర్స్‌లో యాపిల్ 15 రిలీజైన సంగతి తెలిసిందే. యాపిల్ సిరీస్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రాలను కూడా విడుదల చేసింది. https://x.com/TimesNow/status/1705056199186542811?s=20

    అసెంబ్లీలో విజిల్స్ వేసిన బాలకృష్ణ

    ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభలో వీడియోలు తీసినందుకు అచ్నెన్నాయుడు, బి అశోక్‌లను సభా సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చంద్రబాబును విడుదల చేయాలని బాలకృష్ణ నిరసన తెలిపారు. సభలో విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. స్పీకర్ వారించినా విజిల్స్ ఆపలేదు. https://x.com/DailyCultureYT/status/1705076094767186193?s=20

    రష్మిక మంధానకు అవమానం

    అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో నేషనల్ క్రష్ రష్మికకు సరైన గుర్తింపు లభించలేదని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరైన ఈ కార్యక్రమంలో వారెవ్వరూ రష్మికన పట్టించుకోలేదని టాక్. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ యాటిట్యూడ్ పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఫొటో షూట్ అయిపోయాక రష్మిక నవ్వుతూ ఆమె వైపు చూసినా.. శ్రద్ద ఇగ్నోర్ చేసిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. https://x.com/SivaHarsha_23/status/1704423243552284745?s=20

    అక్కినేని కోసం చొక్కా చింపుకున్నా: మోహన్ బాబు

    అక్కినేని శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్‌బాబు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తిరుపతిలో చదివేటప్పుడు అక్కినేని గారి సినిమా వందరోజుల పంక్షన్‌లో ఆయన్ను చూసేందుకు చొక్కా చింపుకుని మరి వెళ్లాను. నాగేశ్వరరావు గారి మరుపురాని మనిషి సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఓ సందర్భంలో అన్నపూర్ణమ్మ గారు అక్కినేని గారి ముందు నేను బాగా నటిస్తానని చెప్పారు. అసలే వాడికి పొగరెక్కువ ఎందుకు పొగుడుతున్నావ్ అని కసురుకున్నారు అని చెప్పుకొచ్చారు. https://x.com/NtvTeluguLive/status/1704372184297123899?s=20

    వన్డే వరల్డ్ కప్ సాంగ్ వచ్చేసెందోచ్…!

    వన్డే ప్రపంచకప్‌ 2023 నేపథ్యంలో ఐసీసీ ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను రూపొందించింది. “దిల్‌ జషన్‌ జషన్‌ బోలే” అంటూ సాంగ్‌ సాగుతోంది. ఈ సాంగ్‌లో అభిమానులను “వన్ డే ఎక్స్‌ప్రెస్‌”లో ప్రయాణిస్తున్నారు. ఈ సాంగ్‌ను ప్రీతమ్ చక్రవర్తి కంపోస్ చేశారు. స్టార్ హీరో రణవీర్ సింగ్ మైక్ పట్టుకుని పాడుతూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. రణ్‌వీర్‌తోపాటు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ కూడా ఆడిపాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. https://x.com/ICC/status/1704384709646864506?s=20

    మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మా మద్దతు: సోనియా గాంధీ

    లోక్‌ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. ‘వంటిల్లు నుంచి ప్రపంచవేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడూ ఆలోచించరు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. స్త్రీలు ఏనాడు వారి స్వార్థం గురించి ఆలోచించరు గతంలో బిల్లును అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం. ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. రాజ్యసభలో తొలుత ఈ బిల్లును ప్రవేశపెట్టింది మేమే’ అని చెప్పుకొచ్చారు. … Read more

    LIVE: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

    మూడో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై సభ్యులు చర్చజరుపుతున్నారు. బిల్లుపై చర్చకు 6 గంటల సమయం కేటాయించారు. బిల్లుపై చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి

    అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని విగ్రహావిష్కరణ

    అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన విగ్రహం వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించనున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌కు బయల్దేరారు. విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు ఇప్పటికే సినీ ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు. దిల్‌రాజు, కె రాఘవేంద్రరావు స్టూడియో వద్ద కనిపించారు. https://x.com/Karthikk_7/status/1704351235745485305?s=20