• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతా; నటి మేఘన

    సీరియల్ నటి మేఘన లోకేష్ తన కో స్టార్‌ను ఫ్రాంక్ కాల్‌తో ఆటపట్టించింది. తన సహ నటి స్వర్ణకు ఫోన్ చేసి ‘‘నాకెవ్వరూ లేరు. చచ్చిపోదామనుకుంటున్నా. నీరసంగా ఉంది. ఇంట్లో ఎవరూ లేరు.’’ అంటూ అమాయకంగా మాట్లాడింది. దీంతో స్వర్ణ తెగ కంగారు పడిపోయి, హడావుడి చేసింది. ‘‘ఇప్పుడే మీ ఇంటింకి వచ్చేస్తున్నా.. కాల్ కట్ చేయొద్దు’’ అంటూ భయపడిపోయింది. ఇది ఫ్రాంక్ కాల్ అనే చెప్పేసరికి ఊపిరి పీల్చుకుంది. మేఘన చేసిన పనికి స్వర్ణకు ముచ్చెమటలు పట్టాయి.

    అల్లు అర్హ బర్త్‌డే; క్యూట్ వీడియో వైరల్

    సౌత్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు అర్హకు సంబంధించిన ఓ [వీడియో](url) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నవంబర్ 21న అర్హ బర్త్‌డే సందర్భంగా ఈ వీడియో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో.. కందిరీగల గురించి తన నాన్నకు ముద్దు ముద్దుగా చెబుతూ కనిపించింది. తెలుగులో చాలా క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోను బన్నీ పోస్ట్ చేస్తూ ‘‘ హ్యాపీ బర్త్‌డే మై క్యూట్ బేబీ అర్హ’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. Happy Birthday … Read more

    బాడీగార్డ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ ఫైర్

    తన బాడీగార్డుపై బిగ్‌బాస్ బ్యూటీ షెహనాజ్ కౌర్ గిల్ ఫైర్ అయింది. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమెతో ఫొటో దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో షెహనాజ్ బాడీగార్డు ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఈ బ్యూటీ తన బాడీగార్డుపై ఆగ్రహంతో ఊగిపోయింది. నీ సమస్య ఏంటని ప్రశ్నించింది. అభిమానులను భయపెట్టవద్దని మండిపడింది. కాగా షెహనాజ్ సింస్లిసిటీకి ఫ్యాన్స్ ముగ్దులైపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. #ShehnaazGill: She scolded the bodyguard and told him not to say … Read more

    ‘ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులు’

    తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దివంగత సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు నటించిన సినిమాల్లోని సన్నివేశాలతో ఓ వీడియో రూపొందించారు. కృష్ణ నటించిన ఆనాటి సినిమాల్లోని సీన్స్, మహేష్ నటించిన సినిమాల్లోని సీన్స్ కలిపి ఎడిట్ చేశారు. ఈ వీడియో చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ ఈనెల 15న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. SuperStars "#Krishna – #MaheshBabu" … Read more

    బ్యాగ్‌తో ఆఫ్తాబ్; సీసీటీవీ ఫుటేజ్ వైరల్

    శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలకు చెందిన ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటికొచ్చింది.[ వీడియో](url)లో ఆఫ్తాబ్ బ్యాగ్ తగిలించుకుని ఓ వీధిలో తెల్లవారుజామున 4.01 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వీధి సమీప అటవీ ప్రాంతానికి వెళ్లే మార్గమని తెలుస్తోంది. ఈ వీడియో అక్టోబర్ 18న రికార్డ్ అయినట్లు సమాచారం. కాగా శ్రద్ధా శరీర భాగాలను పారేసేందుకు ఆఫ్తాబ్ ఈ బ్యాగ్‌ను ఉపయోగించుకున్నట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్ వేసుకుని అక్కడే రెండు మూడు రౌండ్లు వేసినట్లు గుర్తించారు. CCTV footage of … Read more

    రేసింగ్ కార్లతో దద్దరిల్లిన భాగ్యనగరం

    హైదరాబాద్‌లో రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి. హుస్సేన్ సాగర్ తీరంలో స్ట్రీట్ సర్క్యూట్‌పై రేసింగ్ కార్లు పరుగులు పెట్టాయి. సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు రేసింగ్ కొనసాగింది. ఈ రేసింగ్‌లో 12 కార్లు దౌడు తీశాయి. పెట్రోల్ కార్లు 240 కి.మీ స్పీడ్‌తో, ఎలక్ట్రిక్ కార్లు 320 కి.మీ వేగంతో పరుగులు తీశాయి. హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు, గోవా, చెన్నై బృందాలు రేసింగ్‌లో పాల్గొన్నాయి. [రేసింగ్‌](url)ను వీక్షించడానికి ప్రేక్షకులు భారీ ఎత్తున తరలివచ్చారు. Hyderabad Racing ? … Read more

    9 ఏళ్ల బాలికపై కృూరత్వం; వీడియో వైరల్

    కేరళలోని కాసర్‌గడ్ జిల్లా మంజేశ్వర్‌లో 9 ఏళ్ల బాలిక పట్ల ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. అకారణంగా ఆ విద్యార్థినిని అమాంతం పైకి ఎత్తి కింద పడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ చిన్నారి నిల్చొని ఉంది. ఇంతలో బాలిక వైపు కోపంగా వచ్చిన వ్యక్తి ఆమెను ఎత్తి నేలపై పడేశాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.[ వీడియో](url) చూసిన నెటిజన్లు నిందితుడిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. #CCTV: A … Read more

    విశ్వక్ ‘ధమ్కీ’ ఇచ్చేశాడుగా!

    మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ధమ్కీ’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను నటసింహిం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. చిత్రంలో విశ్వక్ డ్యూయెల్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేధా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. రావు రమేష్, రోహిణీ, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశ్వక్ స్వీయ దర్శకత్వం చేపట్టిన ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.

    ట్రక్కుపై డ్యాన్స్.. గాల్లో కలసిన ప్రాణాలు

    కదిలే ట్రక్కుపై ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఓ యువకుడు భారీ ట్రక్కుపై ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంతలో ఒక బ్రిడ్జిని చూసుకోకుండా ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే తల పగిలి మరణించాడు. వెనకే ప్రయాణిస్తున్న వాహనదారులు ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. విచారణలో ట్రక్కుపై యువకుడు ఉన్నట్లు తనకు అసలు తెలియదని చెప్పడంతో డ్రైవర్‌ను వదిలేశారు. That was just plain stupid ? was dancing ? … Read more

    ఎస్కార్ట్‌తో ఫిఫా వరల్డ్‌కప్‌నకు పోలాండ్

    ఖతార్ వేదికగా జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనడానికి పోలాండ్ జట్టు ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌తో రావడం సంచలనంగా మారింది. మధ్యలో ఆటగాళ్లు ఉన్న విమానం ఉండగా.. చుట్టూ ఫైటర్ జెట్స్ [ఎస్కార్ట్‌](url)గా వెళ్లాయి. కాగా వారు ఎస్కార్ట్‌తో రావడానికి బలమైన కారణం ఉంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం వల్లే వాళ్లు ఇలా వచ్చారు. ఈ రెండు దేశాల సరిహద్దులను దాటుకుని పోలాండ్ ఖతార్ రావాల్సి ఉంటుంది. దీంతో పోలాండ్ ప్రభుత్వం ఫైటర్ జెట్స్ సాయంతో జట్టును ఖతార్‌కు పంపించింది. Poland's army sent two … Read more