• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే ఒక జీవితం మూవీ ఫుల్ రివ్యూ

    పెద్దగా ఆడంబరం లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా అమల, నాజర్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. టైం ట్రావెల్ కథగా ప్రేక్షకులను పలకరించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుడిని థియేటర్లో మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? టైం ట్రావెల్ సినిమాలనగానే మనలో తెలియని ఆసక్తి. అవకాశమొస్తే మన తప్పులను సరిదిద్దుకోవాలని ఎదురుచూస్తుంటాం. అలా మన చిన్నతనంలో జరిగిన ఘటనలను మార్చే ఛాన్స్ … Read more

    ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఫుల్‌ రివ్యూ

    బాలివుడ్‌ బాక్సాఫీస్‌కు కోటి ఆశలనిస్తూ ఇవాళ విడుదలైన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, అమితాభ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.400కోట్ల ఈ భారీ బడ్జెట్‌తో సరికొత్త ‘అస్త్రలోకం’గా తీర్చిదిద్దిన ఈ సినిమాను అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించారు. దక్షిణాన  రాజమౌళి సమర్పణ బాధ్యతలు తీసుకున్నారు. మరి సినిమా అంచనాలు అందుకుందా? రివ్యూలో చూద్దాం కథ: బ్రహ్మాస్త్ర సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కథ అంతా బ్రహ్మాస్త్రను కాపాడే బ్రహ్మాన్ష్‌ అనే బృందం … Read more

    ‘ఇంకా క్రికెట్‌ ఉంది’: విరాట్‌ కోహ్లీ

    ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ తన సెంచరీతో మూడేళ్ల ఎదురుచూపులకు తెరపడిన విషయం తెలిసిందే. అయితే ఇన్నింగ్స్‌ అనంతరం విరాట్‌కు అందరూ శుభాకాంక్షలు చెబుతున్న వేళ విరాట్‌ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘క్రికెట్‌ ఇంకా మిగిలి ఉంది’ అంటూ భువనేశ్వర్‌తో విరాట్‌ అన్నాడు. ఈ మాట మేం ఎప్పటినుంచో చెబుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/i/status/1567900196444708867

    LIVE: బాలాపూర్‌ లడ్డూ వేలం

    గణపయ్యకు 9 రోజుల పూజల అనంతరం బాలాపూర్‌ బంగారు లడ్డూ వేలం జరుగుతోంది. 21 కిలోల లడ్డూ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు.

    పావు హైదరాబాద్ శర్వానంద్‌దే! అంత రిచ్‌!!

    ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతన్నాడు శర్వానంద్‌. అయితే శర్వానంద్‌ చాలా సంపన్నుడన్న విషయం చాలా మందికి తెలియదు. తను కావాలనుకుంటే సొంత డబ్బుతో సినిమాలు తీసుకోగలడు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శర్వా చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో యాంకర్‌ ‘పావు హైదరాబాద్ మీదేనంట’ అంటాడు. అప్పుడు శర్వా ‘అంత లేదు గానీ బాగానే ఉన్నాయి.కావాలనుకుంటే నా సినిమాలు నేనే తీసుకోగలను’ అని సమాధానమిచ్చాడు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. intha rich ah sharwa ? … Read more

    జూ.ఎన్టీఆర్ ఎనర్జీ మనుషులకు సాధ్యం కాదు: ఆర్య

    కెప్టెన్‌తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ నటుడు ఆర్య, తెలుగు హీరోలపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. నాని,నితిన్, ఎన్టీఆర్‌ తదితరులపై తన అభిప్రాయం తెలిపాడు. ఎన్టీఆర్‌ గురించి చెబుతూ ‘ఎన్టీఆర్‌కు అంత ఎనర్జీ ఎక్కడినుంచి వస్తుందో తెలియదు. అరగంటకు మించి ఆయనలా ఉండలేం. మనుషులకు ఆయన ఎనర్జీని మ్యాచ్‌ చేయడం సాధ్యం కాదు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అలాగే నితిన్‌ ఇష్క్‌ సినిమా తాను చేయాల్సిందని చెప్పాడు.

    స్టేడియంలో కుర్చీలతో కొట్టుకున్నారు!

    ఆసియా కప్‌లో బుధవారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్‌ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చ జరిగింది. చివరి ఓవర్‌లో తొలి రెండు బంతులకు రెండు సిక్స్‌లు కొట్టిన నసీమ్‌ షా పాక్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దీంతో అసహనానికి గురైన అఫ్గాన్‌ ఫ్యాన్స్‌ పాక్‌ అభిమానులకు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య కొట్లాట తీవ్ర స్థాయిలో జరిగింది. కుర్చీలు, బాటిళ్లు విసురుకుంటూ పరస్పరం దాడి చేసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా వీరిని అదుపు చేయలేకపోయారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. … Read more

    ‘ఒకే ఒక జీవితం’ సెలబ్రిటీ రివ్యూ

    శర్వానంద్‌ హీరోగా వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఇవాళ సెలబ్రెటీలకు ప్రీమియర్‌ షో వేశారు. అయితే సినిమా అద్భుతంగా ఉందని నాగార్జున, అమల, రీతూవర్మ తదితరులు చెప్పారు. సినిమా చూస్తుంటే తనకు అమ్మ గుర్తొచ్చిందని అన్నారు. అమల నటల మరో స్థాయిలో ఉందని పలువురు ప్రముఖులు చెప్పారు. టైం ట్రావెల్‌ సినిమా అయినపుడు ఎమోషనల్‌గా ఉందని, కంటతడి పెట్టించిందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    నెగెటివ్‌ రివ్యూస్‌ ఇస్తే చంపేస్తాడట!

    ఓకే బంగారంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచి ‘సీతారామం’తో తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్న నటుడు దుల్కర్‌ సల్మాన్‌. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాల్లో తనకంటూ పేరు సంపాదించుకున్నాడు.అయితే ఇప్పుడు దుల్కర్‌ తర్వాతి సినిమా కథ మరింత ఆసక్తిగా ఉంది. దుల్కర్‌ నుంచి బాలివుడ్‌ మూవీ ‘చుప్, ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఆర్ బాల్కి ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలకు నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చేవారిని చంపే సైకో థ్రిల్లర్ కథ అని తెలుస్తోంది. సన్నీడియోల్ కీలక … Read more

    అత్తా మామలపై మహిళా ఎస్సై దాడి

    దిల్లీలో ఓ మహిళా ఎస్సై తన మామపై దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆదివారం లక్ష్మీనగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో ఎస్సై తన తల్లి ముందే మామపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎస్సై సహోద్యోగి ఆపే ప్రయత్నం చేశాడు. కొట్టడానికి ముందు వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఎస్సైపై శాఖాపర చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. #WATCH | Case registered under section 323/427 … Read more