• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలీవుడ్ బాక్సాఫీస్‌పై చీకట్లను ‘బ్రహ్మాస్త్ర’ చీల్చగలదా?!

    పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల వద్ద జనం క్యూ కట్టేవారు. సినిమా నచ్చితే బ్లాక్ బస్టర్ గా మలిచేవారు. కానీ ఈ ఏడాది బాలీవుడ్ లో హంగామా పూర్తిగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే.. మిగతావన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. దక్షిణాది చిత్రాలు మెరిసిపోతుండటం, ఓటీటీ హవా కూడా పెరగడంతో అక్కడి వెండితెరకు గిరాకీ తగ్గింది. వచ్చిన సినిమా వచ్చినట్టు థియేటర్ల ముందు బోల్తా పడుతుంటే బీటౌన్‌లో తెలియని అలజడి మొదలైంది. బాలీవుడ్ … Read more

    అదిరిన లెనోవో గ్లాసెస్!

    లెనోవో ఓ సరికొత్త ప్రోడక్ట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. లెనోవో గ్లాసెస్‌ T1 పేరిట తీసుకొచ్చిన ఈ అద్దాలు వర్చువల్‌ మానిటర్‌గా పనిచేస్తాయి. మిగతా వీఆర్ హెడ్‌సెట్స్‌ లాగా ఇది భారీగా ఉండదు. గాగుల్స్ మాదిరిగా జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ గ్యాడ్జెట్‌తో మీరు చూసేది ఇకపై మీకు మాత్రమే కనిపిస్తుంది.

    మద్యం కోసం చోరీ చేసి అడ్డంగా బుక్కయ్యారు

    తమిళనాడులోని తిరువళ్లువార్‌ జిల్లాలో ఇద్దరు దొంగలు మద్యం దుకాణంలో దొంగతనం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికారు. తొలుత వారు లిక్కర్‌ దొంగిలించి అది సొమ్ము చేసుకుందామనుకున్నారు. కానీ దుకాణంలోకి వెళ్లాక, మందు తాగాలని ఆశపుట్టింది. వైన్‌ షాపుకు కన్నం వేసి లోపలికి వెళ్లిన దొంగలు, అక్కడే కూర్చుండి మద్యం మత్తులో తేలారు. ఇంతలో అటుగా వెళ్తున్న పాట్రోలింగ్‌ పోలీసులు గోడకు కన్నం చూసి వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

    రూ.75 కే సినిమా టికెట్‌!

    సినిమా టికెట్‌ ధరలు చర్చనీయాంశంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘జహా చార్‌ యార్‌’ చిత్రబృందం క్రేజీ నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ సినిమా డే సందర్భంగా సెప్టెంబర్‌ 16న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలిరోజు తమ సినిమా టికెట్‌ ధరను రూ.75గా చిత్రబృందం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ తొలి రోజు తమ సినిమా కేవలం రూ.75కే చూడొచ్చని తెలిపింది. వినోద్‌ బచ్చన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్వర భాస్కర్‌తో పాటు పలువురు నటిస్తున్నారు.

    మహిళపై బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన

    కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ లింబవలి తన ప్రవర్తన పట్ల తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. అరవింద్‌ వర్తుర్‌లో పర్యటిస్తుండగా ఓ మహిళ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఇటీవల వర్షాల కారణంగా తాను తీవ్రంగా నష్టపోయానని మహిళ వివరించేందుకు వచ్చారు. దీనిపై అగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. [వీడియో](url)( నోట్‌: అసభ్యకర మాటలు ఉంటాయి) #WATCH |Karnataka BJP MLA Aravind Limbavali verbally abused a woman&misbehaved when she … Read more

    హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ ట్రైనింగ్‌

    ఆదివారం పాకిస్తాన్‌తో మరో ఆసక్తికర సమరానికి భారత్‌ సిద్ధమవుతోంది. అందులో భాగంగా భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌లో ఇరగదీసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ పరుగెడుతూ వర్కవుట్స్‌ చేస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆదివారం మ్యాచ్‌లో విరాట్‌ అద్భుతంగా ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసియా కప్‌లో ప్రస్తుతం విరాట్‌ పరుగుల్లో లీడ్‌లో ఉన్నాడు. https://youtube.com/watch?v=kxsS05yPtDg

    అదరగొడుతున్న విష్ణుప్రియ మాస్‌ సాంగ్‌

    యాంకర్‌, నటి విష్ణు ప్రియ ఫోక్‌ సాంగ్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌తో కలిసి చేసిన ‘జరీ జరీ పంచ కట్టి’ పాట వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. విష్ణుప్రియ, మానస్‌ డ్యాన్స్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. సుద్దాల అశోక్‌ తేజ ఈ పాటను రచించగా… శ్రావణి భార్గవి, సాకేత్‌, స్పూర్తి జితేందర్‌ ఆలపించారు. మదీన్‌ ఎస్‌.కె. మ్యూజిక్ అందించారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. గురువారం విడుదలైన ఈ పాట ఇప్పటిదాకా 25 లక్షలకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది.

    చెరువులో ఈత కొొట్టిన ఈటల రాజేందర్‌

    బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చెరువులో ఈత కొట్టారు. చిన్నపుడు తాను సరదాగా ఈతకొట్టిన కమలాపూర్‌ చెరువులో మరోసారి అలా జలకాలాడారు. ఇటీవల ఈటల తండ్రి మల్లయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. దశదిన కర్మలో భాగంగా చెరువుకు వెళ్లిన ఈటల, అందులో కాసేపు ఈత కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

    ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’  మూవీ రివ్యూ

    ‘అనుదీప్‌ కేవీ’ పరిచయం అక్కర్లేని ‘జాతిరత్నం’. అస్సలు లాజిక్‌ లేని కథ, ఆద్యంతం కామెడీతో ‘జాతి రత్నాలు’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన దర్శకుడు. మరి అలాంటి  అనుదీప్‌ కథ, కథనం అందించిన సినిమా ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’. తమ వెరైటీ ప్రమోషన్లతో సినిమాపై చాలా ఆసక్తి పెంచారు. మరి అనుదీప్‌ ఈ సారి ఫాలో అయిన ఫార్ములా ఏంటి? సినిమా వర్క్‌ అవుట్‌ అయిందా? చూద్దాం సినిమా: ఫస్ట్‌ డే ఫస్ట్ షో దర్శకుడు:వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి నటీ నటులు: … Read more

    రంగరంగ వైభవంగా మూవీ ఫుల్ రివ్యూ..!

    పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాను చిత్రబృందం సెప్టెంబరు 2న విడుదల చేసింది. ట్రైలర్ తో అంచనాలను పెంచిన ఈ సినిమా.. ఎలా ఉంది? థియేటర్లో ఆడియెన్స్ ను మెప్పించిందా? డీఎస్పీ సంగీతం సినిమాకు ఎంతమేర కలిసొచ్చింది? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన రిషి, రాధాల ప్రేమ కథే ఈ సినిమా. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కలిసి పెరిగి.. ప్రేమలో … Read more