• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. క్యూలో త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ వర్మ, బోయపాటి! 

  టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఒకరు. ఇటీవల ఆయన నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ (Kajal Aggarwal).. కూతురిగా శ్రీలీల (Sreeleela) నటించింది. ప్రస్తుతం డైరెక్టర్‌ బాబీ (Director Bobby)తో బాలకృష్ణ ‘NBK109’ చిత్రాన్ని చేస్తున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా మరో మూవీ కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్యను మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

  నాని డైరెక్టర్‌తో సినిమా!

  ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. తాజాగా మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ‘ట్యాక్సీవాలా’ (Taxiwala)తో వచ్చి ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్‌ రాహుల్ సంకృత్యాన్‌ (Rahul Sankrityan)కు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే మూవీ కన్ఫామ్ కానుంది.

  హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌!

  నటసింహాం బాలకృష్ణ.. తన ‘NBK109’ చిత్రాన్ని డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘NBK110’వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో బాలయ్య చేయబోతున్నట్లు న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. దీన్ని ‘అఖండ’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గ స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా చకా చకా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈలోపు బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేస్తారు. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ వంటి బ్లాక్‌ బాస్టర్స్ తర్వాత వీరి కాంబోలో ‘NBK110’ వస్తుండటంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీని తర్వాత బాలయ్య – రాహుల్ సంకృత్యాన్‌ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

  త్రివిక్రమ్‌తో బాలయ్య చిత్రం!

  టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ కూడా త్వరలోనే సెట్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసే అవకాశమున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్‌.. బన్నీతో ఓ సినిమా తీయాల్సి ఉంది. ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌తో బన్నీ బిజీ అయిపోవడం.. తాజాగా పార్ట్‌-3 ఉంటుందని హింట్‌ ఇవ్వడంతో త్రివిక్రమ్‌ తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసేందుకు మెుగ్గు చూపుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కథను సిద్ధం చేయాల్సి ఉందని అంటున్నారు. 

  ఆ డైరెక్టర్లతోనూ చర్చలు!

  నందమూరి బాలకృష్ణ.. బాబీ, బోయపాటి శ్రీనుతోనే కాకుండా మరికొందరు డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తనకు ‘వీర సింహా రెడ్డి’ వంటి హిట్‌ అందించిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni)తోనూ బాలకృష్ణ మరో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ, హరీశ్ శంకర్ వంటి డైరెక్టర్లు కూడా బాలయ్యతో కథకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాలకృష్ణ చకా చకా కొత్త సినిమాలను ఓకే చేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకదానిని సెట్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

  హ్యాట్రిక్‌ హిట్లతో ఫుల్ జోష్‌

  టాలీవుడ్‌లోని సీనియర్ నటులతో (చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌) పోలిస్తే ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నది బాలయ్య మాత్రమే. బాలయ్య చివరి మూడు చిత్రాలు బ్లాక్‌ బాస్టర్లుగా నిలవడం విశేషం. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ వంటి క్రేజీ హిట్ల తర్వాత బాలకృష్ణ నటించిన సినిమానే ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఇలా బాలయ్య వరుసగా మూడు హిట్లను అందుకుని హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం.

  బాలయ్య రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

  సినిమా సినిమాకి తన రేంజ్‌ని (Nandamuri Balakrishna Remuneration) పెంచుకుంటూ పోతున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ని మరింతగా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  అఖండ ముందు వరకు మోస్తరు పారితోషికాన్ని తీసుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్‌ విజయాల తర్వాత దానిని ఒక్కసారిగా పెంచేశారట. తన అప్‌కమింగ్‌ సినిమాలు అన్నింటికి రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. రాబోయే చిత్రాలు సైతం స్టార్‌ డైరెక్టర్లతో ఉండటంతో బాలయ్య ఫ్యూచర్‌ మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. రామ్‌చరణ్‌ (Ramcharan), తారక్‌ (Jr NTR) తరహాలోనే బాలయ్య కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని నందమూరి అభిమానులు అంటున్నారు.  

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv