• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 18 ఏళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు..

    మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ కూల్. 18 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌పై ధోని తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. విచిత్రంగా ధోని కెరీర్ రనౌట్‌తో ప్రారంభమై రనౌట్‌తోనే ముగిసింది. తన సారధ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించి పెట్టాడు. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం ఏర్పాటు చేసుకున్నాడు. దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిపోయాడు.

    క్రికెట్‌లోకి సెహ్వాగ్ తనయుడి ఎంట్రీ

    భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ దేశవాళీ క్రికెట్‌లో [ఆరంగేట్రం](url) చేయనున్నాడు. 15 మందితో కూడిన ఢిల్లీ అండర్-16 జట్టుకు సెలక్టర్లు ఆర్యవీర్‌ను ఎంపిక చేశారు. విజయ్ మర్ఛంట్ ట్రోపీ కోసం అతడిని సెలెక్ట్ చేశారు. బీహార్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆర్యవీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆర్యవీర్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అని, అందుకే అతడిని ఎంపిక చేశామని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్‌పర్సన్ ఆకాశ్ మల్హోత్రా పేర్కొన్నారు. View this post on Instagram A post … Read more

    చాహల్ కూలీ వాడయ్యాడు: శిఖర్ ధావన్

    స్పిన్నర్ చాహల్, అతడి భార్య ధన్య శ్రీని శిఖర్ ధావన్ సరదాగా ఆటపట్టించాడు. కివీస్ తో మూడో వన్డే కోసం భారత జట్టు క్రైస్ట్ చర్చ్ కు పయనమయ్యింది. ఈ క్రమంలో కుటుంబంతో సహా ఆటగాళ్లు బయలుదేరారు. చాహల్ చేతినిండా[ లగేజీ](url) తీసుకొని వస్తున్నాడు. అతడి భార్య వెనకాల తక్కువ లగేజీతో తీసుకువస్తుండటంతో అప్పుడే భర్తను కూలీ వాడిని చేసిందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తన కాలు సరిగా లేదని అందుకే అలా చేశానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. View this post on Instagram … Read more

    జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న కోహ్లీ

    [VIDEO:](url) న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రారంభమయ్యే బంగ్లా సిరీస్‌లో వీరు పాల్గొనున్నారు. ఈ క్రమంలో జిమ్‌లో ఈ ఇరువురు ప్లేయర్లు వర్కవుట్లు చేస్తున్నారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతున్న వీడియోను కోహ్లీ పంచుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, రోహిత్ శర్మ కూడా జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. కాగా, రేపటి నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ని ప్రారంభించనుంది. View this post on Instagram A post … Read more

    పాక్ లో ఓ తరానికి నేను మ్యాచ్ ఫిక్సర్: వసీం అక్రమ్

    పాకిస్థాన్ లో ప్రస్తుత సామాజిక మాధ్యమాల తరం తనను ఇంకా మ్యాచ్ ఫిక్సర్ గానే చూస్తోందంటూ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ అన్నాడు. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి దేశాల్లో మంచి పేస్ బౌలర్ ప్రస్తావన వస్తే తన పేరు కచ్చితంగా ఉంటుందన్నాడు. కానీ, పాకిస్థాన్ లో మాత్రం ప్రతి కామెంట్ లో తనను [మ్యాచ్ ఫిక్సర్](url) అని అంటారనే పేర్కొన్నాడు.1996 లో న్యూజిలాండ్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ పై అక్రమ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. Exclusive: Wasim Akram opens … Read more

    బీచ్ లో టీమిండియా ఆటగాళ్లు

    కివీస్ తో పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు అక్కడ బీచ్ లో కాసేపు సరదాగా గడిపారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు సేద తీరారు. వీరు తమ ఫిజిక్ చూపిస్తూ బీచ్ లో నడిచిన[ వీడియో](url)ను ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పోస్ట్ చేశాడు. దీనికి బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ లోని EVERYBODY సాంగ్ ను జోడించాడు. రేపట్నుంచి జరిగే టీ-20 సిరీస్ లో న్యూజిలాండ్స్ తో తలపడనుంది. View this … Read more

    సచిన్ రిటైర్మెంట్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ

    సరిగ్గా 9ఏళ్ల క్రితం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసకుంటూ బీసీసీఐ ట్విట్టర్‌లో సచిన్ రిటైర్మెంట్ [వీడియో](url)ను పోస్ట్ చేసింది. 2013 నవంబర్ 16న తన 200వ టెస్టును విండీస్‌పై ఆడిన తర్వాత సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ ప్రకటన సమయంలో సచిన్ కన్నీటి పర్యంతం అయ్యాడు. రెండు దశాబ్దాల క్రికెట్ జీవితంలో సచిన్ మొత్తం 664 మ్యాచ్‌లు ఆడినట్లు తెలిపింది. అన్ని ఫార్మట్లలలో కలిపి సచిన్ 34,357 పరుగులు చేశాడు. https://twitter.com/i/status/1063287053046112256https://twitter.com/i/status/1063287053046112256

    టీమిండియాది చెత్త ప్రదర్శన: షోయబ్‌ అక్తర్‌

    ఇంగ్లండ్‌పై సెమీస్‌లో టీమిండియా చెత్త ప్రదర్శన ఇచ్చిందని పాక్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ [అక్తర్‌](url) అన్నాడు. ఫైనల్‌కు వెళ్లటానికి వారు ఏ మాత్రం అర్హులు కాదని పేర్కొన్నాడు. భారత్‌ బౌలింగ్‌ అస్సలు బాగాలేదని…మెుదటి ఐదు ఓవర్ల తర్వాత చేతులెత్తేశారని వ్యాఖ్యానించాడు. కనీసం పోరాడేందుకు ప్రయత్నించలేదన్నాడు. అడిలైడ్‌ పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా ఉన్నా… ఉపయోగించుకునే పేసర్‌ జట్టులో లేడని తెలిపాడు. చాహల్‌ను ఎందుకు ఆడించలేదో అర్థం కావడం లేదన్నాడు. Embarrassing loss for India. Bowling badly exposed. No meet up in … Read more

    మేము రె’ఢీ’…వస్తున్నాం

    పాక్‌ ఫైనల్‌ చేరటంతో ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ భారత్‌కు సవాల్‌ విసిరాడు. మెల్‌బోర్న్‌లో మీ కోసం వెయిట్‌ చేస్తున్నాం రండి అంటూ [ట్వీట్‌](url) చేశాడు.1992 ఫైనల్స్‌లో ఇండియాను ఓడించామని..ఇప్పుడు 2022లోనూ జరుగుతుందని వ్యాఖ్యానించాడు. సంవత్సరం ఒక్కటే తేడా అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంగ్లాండ్‌పై గెలవాలని విషెస్‌ చెప్పాడు. అదృష్టం కొద్ది వెళ్లి అంత ఎందుకు..వస్తున్నాం వెయిట్‌ చేయండి అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. Dear India, good luck for tomorrow. We'll be waiting for you in Melbourne … Read more

    కోహ్లీ ఒక్కరోజు విశ్రాంతి తీసుకో: పీటర్సన్‌

    ఇంగ్లాండ్‌తో టీమిండియా సెమీస్‌ పోరుకు సిద్ధమవుతున్న వేళ ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌కు కోహ్లీకి ఓ అభ్యర్థన చేశాడు. గురువారం ఒక్క రోజు సెలవు తీసుకోవాలంటూ కోరాడు. వరల్డ్‌కప్‌లో భీకరమైన ఫాంలో ఉన్న కోహ్లీ..నెట్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న [వీడియో](url)ను పోస్ట్‌ చేశాడు. దీనికి పీటర్సన్‌ “ డే ఆఫ్ తీసుకోవచ్చు కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు. రేపు ఒక్కరోజు విశ్రాంతి తీసుకో” అంటూ కామెంట్‌ చేశాడు. గతంలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీకి పీటర్సన్‌ మద్దతుగా నిలిచాడు. … Read more