• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడే రాహుల్, అతియా శెట్టిల వివాహం

    కేఎల్ రాహుల్, అతియా శెట్టిల నాలుగేళ్ల ప్రేమాయణం మరోస్థాయికి వెళ్లే సమయం ఆసన్నమైంది. నేడు(జనవరి 23) సాయంత్రం ఈ ప్రేమజంట వివాహ బంధంలోకి అడుగు పెడుతోంది. ఈ వేడుకకు సునీల్ శెట్టి కండాలా ఫాం హౌజ్ వేదిక కానుంది. సాయంత్రం జరగనున్న పెళ్లికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, సల్మాన్ ఖాన్ రానున్నట్లు తెలుస్తోంది. నిన్న సంగీత్ వేడుక జరిగింది. మరోవైపు, ప్రముఖులు ఈ జంటను సోషల్ మీడియా వేదికల ద్వారా ఆశీర్వదిస్తున్నారు. వివాహం అనంతరం ముంబైలో 3000 మంది ప్రత్యేక అతిథులతో విందును … Read more

    రోహిత్ భయ్యా.. ఇంత మతిమరుపా?

    భారత్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌కు వింత అనుభవం ఎదురైంది. [టాస్](url) గెలిచాక.. ఏదీ తీసుకోవాలో గుర్తు లేక సతమతమయ్యాడు. కానీ ఇది కావాలని చేశాడా.. మరచిపోయి చేశాడా అనేది క్లారిటీ లేదు. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘రోహిత్ భయ్యా నీకు ఇంత మతిమరుపా’ అని కొందరు.. కావాలనే చేశాడని మరికొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ? Toss Update ?#TeamIndia win the toss and elect to field … Read more

    ధోనీ న్యూ లుక్; పిక్స్ వైరల్

    భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ న్యూ లుక్ అదిరిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెల్ల గడ్డం, నల్ల జుట్టుతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ట్రెండీగా కనిపిస్తున్నాడు. కాగా ఐపీఎల్ ప్రారంభమవ్వడానికి మరో 2 నెలలు మాత్రమే ఉండడంతో ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ప్రాక్టీస్‌కు సంబంధిం చిన [వీడియో](url)లు కూడా వైరల్‌గా మారాయి. వచ్చే ఐపీఎల్ ధోనీకి చివరిదని క్రీడా విశ్లేషకులు, అభిమానులు పేర్కొంటున్నారు. MS Dhoni practicing at nets ahead of IPL … Read more

    శుభ్‌మన్‌గిల్ ఓల్డ్ వీడియో; నెట్టింట్లో వైరల్

    న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యంగ్ సెన్షేషన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్ చిన్నప్పటి [వీడియో](url) ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2014లో గిల్‌కు 15 ఏళ్లు ఉన్నప్పుడు తన సహచర ఆటగాడు నిర్మల్ సింగ్‌తో కలసి ఓ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో మొదటి వికెట్‌కు ఇద్దరూ కలసి 587 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ సందర్భంగా గిల్ మీడియాతో మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా … Read more

    ‘డబుల్’ బాదాక 3 మ్యాచ్‌ల్లో లేవు.. ఎందుకు’?

    డబుల్ సెంచరీ వీరులు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లు కలసి ఉన్న ఓ [వీడియో](url)ను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రోహిత్ ఇషాన్ కిషన్‌ను ఉద్దేశించి ‘‘డబుల్ సెంచరీ బాదిన తర్వాత నువ్వు 3 మ్యాచ్‌లు ఎందుకు ఆడలేదు? అని ప్రశ్నించాడు. దానికి ఇషాన్ వెంటనే స్పందించాడు. ‘‘భయ్యా నువ్వే కదా కెప్టెన్‌వి. నన్ను నువ్వే కదా జట్టులోంచి తీసేసింది.’’ అనగానే రోహిత్, గిల్ పగలబడి నవ్వుకున్నారు. 1⃣ Frame3️⃣ ODI Double … Read more

    సహచర ఆటగాడిపై హార్దిక్ బూతులు!

    టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన తోటి ఆటగాడిని తిడుతూ స్టంప్ మైక్‌కు దొరికిపోయాడు. శ్రీలంకతో రెండో వన్డే సందర్భంగా 11 ఓవర్ పూర్తయిన తర్వాత వాటర్ తీసుకుని సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో తనకు నీళ్లు ఇవ్వలేదని సుందర్‌పై పాండ్యా నోరు పారేసుకున్నాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవడి*******? అంటూ హిందీలో బూతుపురాణం ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    ఆ సమయంలో ఒత్తిడి సహజం: విరాట్

    ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి అడుగుపెట్టే సమయంలో బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి ఉంటుందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆ సమయంలో రాణించకపోతే బ్యాటర్‌ని మానసికంగా కుంగదీస్తుందని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్‌తో జరిగిన సరదా సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. త్వరలోనే సూర్యకు కూడా ఇలాంటి అనుభవం ఎదురవ్వొచ్చని తెలిపాడు. ‘ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తపనతో ముందుకు సాగాలి. రెండు అడుగులు వెనక్కు వేసినా సరే. విజయం కోసం కాంక్షించాలి. తొందరపడొద్దు. నిరాశకు గురికావొద్దు’ అని విరాట్ చెప్పాడు .కోహ్లీ అభిప్రాయంతో సూర్య కూడా అంగీకరించాడు. Of … Read more

    చిన్నారి ఫ్యాన్ ఎమోషనల్; ఓదార్చిన హిట్‌మ్యాన్

    ఓ చిన్నారి భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మను చూసి ఎమోషనల్ అవగా హిట్‌మ్యాన్ అతడిని ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లంకతో మొదటి వన్డేకు ముందు గౌహతిలో రోహిత్ మీడియాతో మాట్లాడాడు. అనంతరం కొంతమంది అభిమానులు రోహిత్‌ను పలకరించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఇండియన్ జెర్సీ ధరించిన ఒక బాలుడు రోహిత్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. ఇది గమనించిన హిట్‌మ్యాన్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. Cricketer Rohit Sharma interacting with an young cricket … Read more

    పంత్ త్వరగా కోలుకో: టీమిండియా

    రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్ కోరుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది. రాహుల్ ద్రవిడ్‌తో పాటు టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, శుభ్‌మన్ గిల్ పంత్‌ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరారు. ‘పంత్.. నువ్వు పోరాట యోధుడివి. ఇబ్బందులను అధిగమించడం నీకేమీ కొత్త కాదు. అలాగే ఇప్పుడు కూడా కాలాన్ని జయించగలవు. మన జట్టు, దేశం నీ వెనక ఉంది. మా ప్రేమాభినాలు ఎప్పుడూ … Read more

    వేలు విరిగినా.. 4 గంటల పాటు బ్యాటింగ్

    ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలు విరిగినా ఓపిగ్గా 4 గంటలపాటు బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు సందర్భంగా అన్రిచ్ నోర్ట్జే విసిరిన బంతి గ్రీన్ చేతి వేలికి బలంగా తాకింది. వేలు చీలిపోయి రక్తం కారడంతో [రిటైర్డ్ హర్ట్‌](url)గా వెనుదిరిగాడు. కానీ ఏడో వికెట్ పడ్డాక మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 177 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. 4 గంటల పాటు ఓపిగ్గా బ్యాటింగ్ చేయడంపై గ్రీన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ … Read more