ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి అడుగుపెట్టే సమయంలో బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి ఉంటుందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆ సమయంలో రాణించకపోతే బ్యాటర్‌ని మానసికంగా కుంగదీస్తుందని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్‌తో జరిగిన సరదా సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. త్వరలోనే సూర్యకు కూడా ఇలాంటి అనుభవం ఎదురవ్వొచ్చని తెలిపాడు. ‘ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తపనతో ముందుకు సాగాలి. రెండు అడుగులు వెనక్కు వేసినా సరే. విజయం కోసం కాంక్షించాలి. తొందరపడొద్దు. నిరాశకు గురికావొద్దు’ అని విరాట్ చెప్పాడు .కోహ్లీ అభిప్రాయంతో సూర్య కూడా అంగీకరించాడు.