• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 50 రన్స్‌కే కుప్పకూలిన శ్రీలంక

    ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక కుప్పకూలింది. 15.2 ఓవర్లలోనే 50 ఓవర్లకే ఆలౌట్ అయింది. సిరాజ్ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిరాజ్ 6, బుమ్రా 1 హార్దిక్ మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా నిలిచారు.

    ASIA CUP: ఒకే ఓవర్‌లో 4 వికెట్లు

    ఆసియా కప్‌ ఫైనల్లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. టీమ్‌ఇండియా ధాటికి శ్రీలంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ తీశాడు. అటు బుమ్రా తొలి ఓవర్‌లోనే వికెట్‌ పడగొట్టడం విశేషం. మెుత్తంగా సిరాజ్‌ ఐదు వికెట్లను పడగొట్టాడు. ఔటైన ఆరుగురు శ్రీలంక బ్యాటర్లలో నలుగురు డకౌట్‌ కావడం గమనార్హం. ప్రస్తుతం 10 ఓవర్లలో 31/6 స్కోరుతో శ్రీలంక బ్యాటింగ్ చేస్తోంది.

    వర్షం కారణంగా నిలిచిన ఫైనల్ మ్యాచ్

    భారత్- శ్రీలంక మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. టాస్ వేసిన కొద్ది సేపటికే వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో గ్రౌండ్‌ను క్లీన్ చేసేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. ఫీల్డ్‌లోని వాటర్‌ను తొలగిస్తున్నారు. ఫలితంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పూర్తిస్థాయిలో మ్యాచ్ నిలిచిపోయిన రేపు రిజర్వ్ డే అయితే ఉంది.

    అదిరిపోయే షాట్.. కోహ్లీ భారీ సిక్సర్

    శ్రీలంకపై మూడో వన్డేలో కింగ్ కోహ్లీ సెంచరీతో అదరగొడుతున్నాడు. అయితే, సెంచరీ పూర్తి చేసిన అనంతరం విరాట్ 97మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. తన సహజ శైలికి విరుద్ధంగా ఈ షాట్ ఆడటం విశేషం. రజిత బౌలింగులో కోహ్లీ రెండు అడుగులు ముందుకేసి లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్‌ని కొట్టాడు. ఈ క్రమంలో విరాట్ శైలి ఏబీ డివిలియర్స్‌ని తలపిస్తున్నట్లుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, కోహ్లీ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 46వ సెంచరీని నమోదు చేశాడు. అత్యధికంగా శ్రీలంకపై 10 … Read more

    ఆ సమయంలో ఒత్తిడి సహజం: విరాట్

    ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి అడుగుపెట్టే సమయంలో బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి ఉంటుందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆ సమయంలో రాణించకపోతే బ్యాటర్‌ని మానసికంగా కుంగదీస్తుందని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్‌తో జరిగిన సరదా సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. త్వరలోనే సూర్యకు కూడా ఇలాంటి అనుభవం ఎదురవ్వొచ్చని తెలిపాడు. ‘ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తపనతో ముందుకు సాగాలి. రెండు అడుగులు వెనక్కు వేసినా సరే. విజయం కోసం కాంక్షించాలి. తొందరపడొద్దు. నిరాశకు గురికావొద్దు’ అని విరాట్ చెప్పాడు .కోహ్లీ అభిప్రాయంతో సూర్య కూడా అంగీకరించాడు. Of … Read more