• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్‌ రూ. 100 స్మారక నాణేం విడుదల

    ఎన్టీఆర్‌ రూ. 100 స్మారక నాణేంను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా విడుదల చేశారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవల గుర్తింపుగా నాణేం విడుదల చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామాయణ ,మహాభారతం సినిమాల్లో ఎన్టీఆర్ నటించి మెప్పించారని కొనియాడారు. మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో చూపించారని తెలిపారు. రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. NTR #NandamuriTarakaRamarao … Read more

    అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

    ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్‌లోని గెలాక్సీ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మంటలను అదుపు చేశారు. హోటల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. India- A fire broke out in Hotel Galaxy located in the Santacruz area of Mumbai.Three killed, six rescued.#India #mumbai #Fire #accident … Read more

    జాబిల్లిపై చక్కర్లు కొడుతున్న ‘రోవర్’

    ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టినప్పటి నుంచి ఇస్రో ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉంది. తాజాగా రోవర్ చంద్రుడిపై చక్కర్లు కొడుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. అందులో రోవర్ జాబిల్లిపై తిరుగుతూ పరిశోధనలు చేస్తోంది. చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మట్టి, గడ్డ కట్టిన నీటి అణువులను అన్వేషిస్తోంది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన రోవర్ రెండువారాల పాటు ఇదే పనిలో ఉంటుందని ఇస్రో పేర్కొంది. Chandrayaan-3 Mission:?What's new here? Pragyan rover roams around Shiv Shakti Point in pursuit … Read more

    ల్యాండర్ దిగుతున్న దృశ్యాలు ఇవే?

    చంద్రుడిపై చంద్రయాన్‌-3 ల్యాండర్‌ విజయవంతంగా అడగుపెట్టింది. అనంతరం రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడిపై తన అధ్యయనాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇస్రో ఓ వీడియోను విడుదల చేసింది. ల్యాండర్ చంద్రుడిపై దిగుతున్న దృశ్యాలను ట్వీట్టర్‌లో పంచుకుంది. అందులో ‘చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను చంద్రయాన్‌-2 ఫొటో తీసిందని పేర్కొంటూ ఓ మీడియోను రిలీజ్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను కొద్దిసేపటికే ఇస్రో తొలగించింది. … … and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar … Read more

    హిమాచల్‌లో వరద బీభత్సం

    హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టించింది. తాజాగా కొండచరియ విరిగిపడటంతో భవనాలు కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాల క్రింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారిని కాపాడటం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగాయి. కులు-మండీ హైవేపై వందలాది వాహనాలు చిక్కుకున్నాయి. ఈ ఘటనపై సీఎం సుఖ్విందర్ సింగ్, పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. An important update coming from Kullu district, Himachal Pradesh. Amidst the ongoing challenges, a fresh landslide in … Read more

    రైల్వే వంతెన కూలి 17 మంది మృతి

    మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఐజ్వాల్ కు 21 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా ప్రదేశంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో 35 నుండి 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు శిథిలాల కింద నుండి 17 మృతదేహలను వెలికి తీశారు. ఇంకా ఎంత మంది మృతి చెంది ఉన్నారన్న దానిపై స్పష్టత రాలేదు. An under-construction bridge in Mizoram … Read more

    ఒకే రోజు.. రెండు రైళ్లలో మంటలు

    ఇవాళ రెండు రైళ్లలో అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్‌పుర్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా.. కర్ణాటకలో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తుండగా ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలు నిలిపేసి మంటలు ఆర్పారు. అటు బెంగుళూరులోని KSR రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. Just a few minutes of peril between pandhurna and darimeta …. … Read more

    వాజ్‌పేయి వర్ధంతి, ప్రధాని, రాష్ట్రపతి నివాళులు

    నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ స్మారక చిహ్నం వద్ద వాజ్‌పేయి కుటుంబ సభ్యులతో సహా వీరంతా నివాళులు అర్పించారు. వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి చెందిందని మోదీ కొనియాడారు. 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. #WATCH | Delhi: President Droupadi Murmu … Read more

    బ్రిటిష్‌ ఆర్కెస్ట్రాతో జనగణమణ

    గ్రామీ అవార్డు గ్ర‌హీత రిక్కీ కేజ్‌.. భార‌త జాతీయ గీతాన్ని ఆర్కెస్ట్రాలో రికార్డింగ్ చేశారు. లండ‌న్‌లో అబ్బే స్టూడియోలో వంద మంది బ్రిటీష్ ఆర్కెస్ట్రా బృందంతో జ‌నగ‌ణమ‌ణ గీతాన్ని రికార్డు చేశారు. రాయ‌ల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఈ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేశారు. ప్ర‌ఖ్యాత అబ్బే రోడ్ స్టూడియోస్‌లో ఈ సాంగ్‌ను రికార్డు చేశారు. భార‌త జాతీయ గీతాన్ని ఇంత పెద్ద ఆర్కెస్ట్రాతో రికార్డు చేయ‌డం ఇదే మొద‌టిసారి. చాలా అత్య‌ద్భుతంగా ఆ ఆర్కెస్ట్రా ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. ఆ ఆర్కెస్ట్రా వీడియోను రిక్కీ కేజ్ సోష‌ల్ … Read more

    24 గంటల్లో 50 మంది మృతి

    హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతర వర్షాల కారణంగా గత 24 గంటల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. శిథిలాల కింద 20 మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం లేదని సీఎం అన్నారు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, కాంగ్రెస్‌ – భాజపా అధ్యక్షులు తమ ప్రభుత్వానికి సాయం చేయాలని కోరారు. Massive devastation due … Read more