• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జలపాతంలోకి జారిపోయిన కారు

    మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఘోర ప్రమాదం తప్పింది. లోహియా కుంద్‌ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబం ఊహించని ప్రమాదాన్ని ఎదుర్కొంది. వారు తమ కారును జలపాతానికి సమీపంలో నిలిపి ఉంచగా వాహనం దానంతట అదే జలపాతం వైపు జారిపోయింది. ఆ సమయంలో కారులో తండ్రీ కూతురు ఉన్నారు. గమనించిన స్థానికులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. Instead of engaging Reverse gear, mistakenly engaged first … Read more

    మద్యం మత్తులో బాస్‌కు మెసేజ్.. వైరల్

    మద్యం మత్తులో ఓ జూనియర్ తన బాస్‌కు పంపించిన వాట్సాప్ సందేశాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో ఏముందంటే..‘బాస్‌ నేను మద్యం మత్తులో ఉన్నాను. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మంచి కంపెనీలో ఉద్యోగం దొరకడం కన్నా మంచి మేనేజర్‌ దొరకడం ఎంతో కష్టం. నేను చాలా లక్కీ. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీకు మీరు అభినందనలు చెప్పుకోండి’ అని రాశాడు. దీనిని సదరు మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. Drunk … Read more

    ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ

    ఈ మధ్య తరచూ విమానాల్లో కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇండిగో విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చండీఘడ్ నుంచి జైపుర్‌కి వెళ్లే విమానంలో ఈ దుస్థితి తలెత్తింది. దీంతో చేసేదేం లేక ప్రయాణికులు అట్టలతో ఊపుకున్నారు. ఎయిర్ హెస్టెస్ టిష్యూ పేపర్లు అందిస్తే చెమటను తూడ్చుకున్నారు. ఈ వీడియోను పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. 90 నిమిషాల పాటు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ట్వీట్ చేశారు. Had one … Read more

    ఆందోళనాకారుల ఇళ్లపై బుల్డోజర్ ప్రయోగం

    హరియాణాలో అల్లర్లకు కారణమైన వారి ఇళ్లపై ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది. ఈ క్రమంలో నూహ్ జల్లాలో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను తొలగించింది. వారు అక్రమ వలసలు వచ్చి ఇక్కడ మకాం వేసి అల్లర్లకు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఆందోళనల్లో వీరు పాల్గొని రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో పాల్గొన్న సీసీటీవీ దృశ్వాలను పోలీసులు సేకరించారు. ఈ మేరకు దాడులు చేస్తున్న ఫోటోలను విడుదల చేశారు. UP model in Haryana ?? This is Bulldozer 'justice' Houses of 250 … Read more

    ‘సైలెంట్‌గా ఉండకపోతే మీ ఇంటికి ‘ఈడీ’ వస్తుంది’

    లోక్‌సభలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ సైలెంట్‌గా ఉండక పోతే తమ ఇంటికి ఈడీ వస్తుందని హెచ్చరించారు. అనంతరం బిల్లుపై మాట్లాడుతూ కేజ్రీవాల్ పావు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పకనే చెప్పారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. This insinuating threat given by @M_Lekhi in the heat of the … Read more

    మత ఘర్షణల్లో ఏడుగురు మృతి

    హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విశ్యహిందూ పరిషత్ మతపరమైన ఉరేగింపును మరో వర్గం అడ్డుకుంది. దీంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనాకారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. ఈ హింసలో ఇద్దరు హోంగార్డులతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఇప్పటి వరకు 116 మంది ఆందోళనాకారులను అరెస్ట్ చేశారు. Stone pelting can be seen from rooftops in Nuh, Mewat of Haryana. pic.twitter.com/I0fPIlXkIy — Aditya Raj Kaul (@AdityaRajKaul) July … Read more

    పాఠాలు చెబుతున్న రోబో టీచర్

    బెంగళూరులో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, రోబో టీచర్‌ను పరిచయం చేసింది. ఈ రోబో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులను బోధిస్తుంది. ఇలా పాఠాలు చెబుతున్నఈ రోబో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రోబో పాఠాలతో పాటు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన రోబో టీచర్ ప్రపంచంలో మొట్టమొదటిది కావడం విశేషం. World's first ROBOT teacher designed by Indian AI experts,started teaching at Bangalore in INDUS school.This 5 feet … Read more

    రైతుపై పగబట్టిన ఎద్దు..! వీడియో వైరల్

    యూపీలోని బలియా జిల్లాలో ఓ ఎద్దు రైతును ముప్పుతిప్పలు పెట్టింది. దాడి చేసేందుకు వచ్చిన ఎద్దు నుంచి తప్పించుకునేందుకు ఆ రైతు 2 గం.లపాటు చెట్టుపైనే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రస్డా పోలీస్‌స్టేషను పరిధిలో దారితప్పిన ఓ ఎద్దు ఇటీవల 12 మందిపై దాడి చేసింది. ఈ క్రమంలో ‌అది ఖఖ్ను అనే రైతు వెంటపడింది. దీంతో అతడు భయపడి చెట్టు ఎక్కినా ఎద్దు వదల్లేదు. పగబట్టినదానిలా చెట్టు దగ్గరే తిరుగుతూ అక్కడే ఉండిపోయింది. बलिया में आवारा … Read more

    రాహుల్‌ గాంధీకి పెళ్లి చేద్దామా..?

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హరియాణా మహిళా రైతులు.. సోనియా గాంధీతో మాట్లాడుతూ రాహుల్‌ వివాహం గురించి అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి’ అని అన్నారు. దీంతో ‌అక్కడే ఉన్న రాహుల్‌ నవ్వుతూ ‘అవుతుంది.. అవుతుంది’ అని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణం గురించి మహిళలు సోనియాను అడగ్గా ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. मां, प्रियंका और मेरे … Read more

    తెల్లవారుజామున ఘోర విషాదం

    మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 21 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. బస్సుల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రమాదానికి కారణమేంటో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Maharashtra | Six passengers dead, 21 injured in collision between two buses in … Read more