• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెస్టారెంట్‌లో గొడవ: IPS, IAS సస్పెన్షన్

    రాజస్థాన్‌లో ఓ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు చేసిన గొడవ వారి సస్పెన్షన్‌కు దారి తీసింది. అజ్మీర్‌ ఐఏఎస్ అధికారిగా గిరిధర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడ సునీల్‌కుమార్ ఐపీఎస్ అధికారిగా కొత్తగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ చేసుకునేందుకు సునీల్‌, గిరిధర్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో సిబ్బందికి వారి మధ్య గొడవ జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీపీటీవీ టీవీలో రికార్డు అయ్యాయి. అవి కాస్త వైరల్ కావడంతో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. IPS Sushil Bishnoi is seen fighting … Read more

    కుప్పకూలిన పార్కింగ్‌ ఏరియా

    పంజాబ్‌లోని మొహాలీలో ఓ పార్కింగ్‌ ఏరియా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ గుంత ఏర్పడింది. అందులోపడి పది బైకులు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఐటీ సిటీ ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్‌ స్థలం పక్కనే భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ భవనానికి బేస్‌మెంట్‌ తవ్వుతుండగా పార్కింగ్‌ స్థలం కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలవలేదని మొహాలీ డీఎస్పీ తెలిపారు. #WATCH | Punjab: Several vehicles … Read more

    51 ట్రాక్టర్లతో పెళ్లి మండపానికి వరడు

    రాజస్థాన్‌లో ఓ వ్యకి తన పెళ్లిని వినూత్నంగా గుర్తుండి పోయోలా చేసుకున్నాడు. 51 ట్రాక్టర్లతో 51 కి,మీ ఉరేగింపుగా వెళ్లి వధువును మనువాడాడు. బర్మేర్‌కు చెందిన జేతారామ్‌కి బొర్వా గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. 51 కి.మీ ఉన్న వధువు గ్రామానికి అంతే సంఖ్యలో 51 ట్రాక్టర్లతో వెళ్లి వరుడు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాక్టర్‌ను రైతుకు గుర్తింపుగా భావించి ఈ పని చేశానని వరుడు తెలిపాడు. #WATCH | Rajasthan: A groom … Read more

    భక్తులపై పోలీసులు లాఠీచార్జ్

    పుణేలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వార్కారీ భక్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఆగ్రహానికి గురై భక్తులపై లాఠీచార్జ్ చేశారు. పూణే సమీపంలోని అలండి పట్టణంలో శ్రీ క్షేత్ర ఆలయంలో ఓ వేడుక కోసం భక్తులు ఉరేగింపుగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులను నియంత్రించేందుకు లాఠీచార్జ్ చేశామని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే దీనిని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డాయి. #WATCH | Maharashtra: A scuffle broke out between warkaris … Read more

    కన్నీళ్లు పెట్టుకున్న ముఖ్యమంత్రి

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు. తన సన్నిహితుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఓ స్కూల్ ప్రారంభోత్సవంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘‘సిసోడియాను ఎంతో మిస్ అవుతున్నా. విద్యాశాఖ మంత్రిగా ఆయన మరపురాని సేవలు అందించారు. ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాలన్నది ఆయన కల. అలాంటి వ్యక్తిని జైలులో పెట్టారు. తప్పుడు కేసులతో సిసోడయాను జైల్లో పెట్టారు.’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. Delhi CM @ArvindKejriwal breaks down remembering the contribution of … Read more

    ‘హెవీ వాట‌ర్ టార్పిడో’ పరీక్ష సక్సెస్‌

    స్వదేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన ‘హెవీ వాట‌ర్ టార్పిడో’ను భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. సముద్ర గర్భంలో ఈ పరీక్ష నిర్వహించగా.. అందుకు సంబంధించిన [వీడియో](url)ను నేవీ అధికారులు రిలీజ్ చేశారు. నిర్ధేశిత లక్ష్యాన్ని టార్పిడో ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఇండియన్‌ నేవీలో ఇది సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. సముద్ర గర్భ యుద్ద కార్యకలాపాల్లో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుందని అధికారులు ప్రకటించారు. Successful engagement of an Underwater Target by an indigenously developed Heavy Weight Torpedo is … Read more

    బిహార్‌లో కూలిన నిర్మాణంలోని వంతెన

    బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. భాగ్లాపూర్‌లోని అగువానీ, సుల్తాన్ గంజ్ మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి ఇది. ఇదే వంతెన కుప్పకూలడం ఇది రెండోసారి కావడం గమనార్హం. దీనిపై సుల్తాన్‌గంజ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్ స్పందించారు. నవంబర్, డిసెంబర్ లోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేదని ఆయన చెప్పారు. కానీ, ఇలా కూలిపోవడం దురదృష్టకరమని వెల్లడించారు. దీనిపై కచ్చితంగా దర్యాప్తు జరగాలని జేడీయూ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. #WATCH | Under construction Aguwani-Sultanganj bridge … Read more

    VIDEO: రెండు రైళ్లు ఇలా ఢీకొన్నాయి

    బాలేశ్వరం ప్రమాదం జరిగిన తీరు, అక్కడి దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ప్రయాణికులతో ఉన్న రెండు రైళ్లు, ఒక గూడ్స్ ఢీకొనడం ఈ విషాదానికి కారణమైంది. ఒక రైలు బోగీపై మరొకటి వెళ్లిపోవడం, సహాయక సిబ్బంది మృతదేహాలన్నింటిని ఒక వరుసలో ఉంచిన దృశ్యాలు దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. రెండు రైళ్లు అతివేగంతో వెళ్లడంతో ఈ మూడింటి మధ్య తాకిడి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో కొన్ని బోగీలు గాల్లోకి లేచి, తిరిగిపోయాయి. రైలు ప్రమాదం జరిగిన తీరును కొన్ని మీడియా సంస్థలు గ్రాఫిక్స్ ద్వారా తెలిపాయి.

    మహా విషాదం.. 233 మంది మృతి

    దేశ చరిత్రలోనే ఒడిశాలో మహా విషాదం చోటు చేసుకుంది. బాలసోర్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు పెరిగింది. 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను భువనేశ్వర్, భద్రక్ మయూర్ భంజ్ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. #WATCH | Latest visuals from the site of the deadly train accident in Odisha's Balasore. Rescue … Read more

    TRAIN ACCIDENT: 50 మంది మృతి?

    ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 50 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 300 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఒడిశాలోని బాలాసోర్ సమీపంలోని బహనాగ రైల్వేస్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో స్లీపర్ కోచ్‌లు తప్ప మిగతా అన్నీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు రైళ్లు ఒకే లైన్‌లో రావడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. Tragic Train accident at around 7pm. … Read more