• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బస్సును హత్తుకుని ఏడ్చేసిన డ్రైవర్

    మనుషుల మధ్య సంబంధాలే కాదు.. వస్తువులపై ఇష్టం పెంచుకుని వాటిని వీడాలంటే ఎంత బాధగా ఉంటోందో కళ్లకు కట్టాడు ఓ బస్ డ్రైవర్. రిటైర్మెంట్ రోజు ఎవరైనా సంతోషంగా వెళ్తారు. కానీ తమిళనాడుకు చెందిన బస్సు డ్రైవర్ మాత్రం కన్నీరుమున్నీరయ్యారు. ఇక రేపటి నుంచి.. ఈ బస్సుకు డ్రైవర్‌గా ఉండలేనని బస్సును గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    టైగర్ వీడియోపై ప్రధాని ప్రశంస

    టైమ్స్ ఆఫ్ ఇండియా సేవింగ్ అవర్ స్ట్రైప్స్ పేరుతో రూపొదించిన టైగర్ యాంథమ్ వీడియో‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. పులుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయడానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ చేసిన మంచి ప్రయత్నం ఇది. ప్రజలకు ధన్యవాదాలు.. మన దేశం ఈ దిశగా ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది అని తెలిపారు This is a good effort by the @timesofindia group towards highlighting the importance of tiger conservation. Thanks to … Read more

    సముద్రం లోపల బంగారం సీజ్

    ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చేసిన సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. సముద్రంలో దాచిన 32.689 కిలోల బంగారాన్ని వెతికి మరీ కనిపెట్టారు. తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏరియాలో రెండు ఫిషింగ్ బోట్లు బంగారాన్ని దాచినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో డీఆర్ఐ, కస్టమ్ అధికారులతో కలిసి కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్‌ని చేపట్టారు. సముద్రం లోనికి స్కూబా డైవింగ్ చేసి అక్కడ దాచిన బంగారాన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.20.2 కోట్లు ఉంటుందని అంచనా. శ్రీలంక … Read more

    రెజ్లర్లపై ప్రశ్న.. పరుగందుకున్న కేంద్రమంత్రి

    రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ గత కొన్ని రోజులుగా స్టార్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించారు. ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న మంత్రిని రెజ్లర్ల గురించి అడిగారు. రిపోర్టర్‌ ప్రశ్నకు ఏమాత్రం స్పందించని కేంద్ర మంత్రి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తన కారు వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో రిపోర్టర్‌ కూడా మంత్రి వెంట పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ షేర్ … Read more

    నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-12

    శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటు GSLV F-12 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం మొదలైన కౌంట్ డౌన్ 10.46 నిమిషాలకు పూర్తై.. రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం రాకెట్ సవ్యమైన దిశలో సాగుతోందని శాస్త్రవేత్తల వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా స్వదేశి నావిగేషన్ ఉపగ్రహం NVS-01ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. CONGRATULATIONS @isro !!#ISRO launches GSLV-F12 NVS-01 Mission from Satish Dhawan Space Centre (SDSC-SHAR), #Sriharikota Link – https://t.co/WuZWseMSdO pic.twitter.com/ysGHCZsb1d — … Read more

    టాస్ గెలిస్తే చెన్నై బ్యాటింగ్?

    ఐపీఎల్ ఫైనల్‌ సన్నద్ధతపై చెన్నై కోచ్ స్టిఫెన్ ఫ్లేమింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫైనల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఫైనల్స్‌లో మా రికార్డు 50శాతంగా ఉంది. శుభ్‌మన్‌ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. గిల్‌ను త్వరగా ఔట్‌ చేయాల్సి ఉంది. గత మ్యాచ్‌లో త్వరగా వికెట్లను తీయడం వల్ల GT పైచేయి సాధించగలిగాం. తొలి క్వాలిఫయర్‌లో తొలుత మేం బౌలింగ్‌ చేయాలని భావించాం. కానీ ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేయడం సరైందేనని తేలింది. ఈసారి టాస్ కీలకం. మాకున్న అనుభవంతో ఫైనల్‌ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తాం’ అని … Read more

    రెజ్లర్లను అడ్డుకున్న భద్రతా సిబ్బంది

    నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఉండటంతో రెజ్లర్లు మహిళా మహాపంచాయత్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్లమెంట్ వరకు మార్చ్‌ని నిర్వహిస్తుండగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుంది. జంతర్ మంతర్ నుంచి తరలివస్తుండగా రెజ్లర్లను అధికారులు నిర్బంధించారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని రెజ్లర్లు సంకల్పించినా పోలీసులు అడ్డుకోవడంతో వారు నిరసన తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ బ్రిజ్‌భూషణ్‌కి వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they … Read more

    సినిమా స్టార్ల ట్వీట్.. ప్రధాని రిప్లై

    సినీ సెలబ్రిటీలు రజినీకాంత్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనం విశిష్ఠతలను వివరిస్తూ వీరు తమ వాయిస్ ఓవర్ ఇచ్చి ట్వీట్ చేశారు. వీరికి మోదీ రిప్లై ఇచ్చారు. షారూక్ ట్వీట్‌కి స్పందిస్తూ అద్భుతంగా వర్ణించారన్నారు. ‘అద్భుతంగా వర్ణించారు. ప్రజాస్వామ్య పురోగతికి ఈ నూతన పార్లమెంట్ భవనం నిదర్శనం. సంప్రదాయం, ఆధునికతల మేళవింపు’ అని రిప్లై ఇచ్చారు. తలైవా రజినీకాంత్, అక్షయ్ కుమార్ ట్వీట్ చేసిన వీడియోను సైతం ప్రధాని రీట్వీట్ చేశారు. Beautifully expressed! … Read more

    ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేది: ఓవైసీ

    నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా జరిగితే బాగుండేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ అగ్నిమాపక శాఖ అంగీకారం కూడా లేదని ఆరోపించారు. పార్లమెంట్ ఓ శవపేటికతో సమానం అన్న ఆర్జేడీ వ్యాఖ్యలపై ఓవైసీ స్పందించారు. ‘ఆర్జేడీకి నిశ్చితాభిప్రాయం లేనట్లుంది. శవపేటికతో పోల్చడం సరైంది కాదు. వేరే ఏదైనా పదాలు వాడాల్సింది. ఈ కోణంలో మాట్లాడటం తగదు’ అని అసదుద్దీన్ చెప్పారు. #WATCH | It would … Read more

    ఆనాడు గవర్నర్ గుర్తు రాలేదా?: తమిళిసై

    పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతుండడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సమర్థించారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్ గురించి గవర్నర్ ప్రస్తావించారు. ‘నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్‌ గవర్నర్‌ చేతుల మీదుగా జరగాలని ప్రతిపక్షాలు చెప్పాయి. కానీ, కార్యనిర్వహక భవనం పేరుతో కనీసం నన్ను ఆహ్వానించలేదు. మరి, ఇప్పుడెలా రాష్ట్రపతి ప్రారంభించాలని అంటున్నారు? ఆ నాడు గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరురాలు అని గుర్తు రాలేదా?’ అని గవర్నర్ ప్రశ్నించారు. తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా. #WATCH | #NewParliamentBuilding … Read more