• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళా క్రికెటర్ల అదిరిపోయే స్టెప్పులు

    [VIDEO](url): టీమిండియా మహిళా క్రికెటర్లు ఓ తమిళ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. విశాల్‌, ఆర్య ‘ఎనిమి’ సినిమాలో ‘టమ్ టమ్’ పాటకు వారు డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న టీమిండియా బృందం టీ20 వరల్డ్‌ కప్‌నకు ముందు ట్రై సిరీస్‌ కోసం అక్కడికి వెళ్లింది. గురువారం ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్‌ దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, ఇతర క్రికెటర్లు తమ స్టెప్పులతో అలరించారు. https://www.instagram.com/reel/CoKTcgmDirY/?utm_source=ig_web_copy_link

    హనుమ విహారి రివర్స్ స్లాప్‌

    రంజీ ట్రోఫీలో గాయం తగిలినా జట్టుకోసం ఒంటి చేత్తో బ్యాటింగ్‌కు దిగిన హనుమ విహారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి పోరాట పటిమ గురించి చాలామందే ప్రస్తావించారు. ఆ మ్యాచ్‌లో విహారి ఆడిన ఓ షాట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గాయం తగిలిన చేతికి బాల్‌ తగలకుండా సింగిల్‌ హ్యాండ్‌తో రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. దీనికి దినేశ్ కార్తీక్‌ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. అతడి రివర్స్ స్వీప్‌ కాదు రివర్స్‌ స్లాప్‌ అని పేరు పెట్టాడు. thepraneetc23

    భావోద్వేగానికి గురైన చిరంజీవి

    కళాతపస్వి కె. విశ్వనాథ్‌ మరణంతో సినీలోకం విషాదంలో ఉంది. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

    కె. విశ్వనాథ్‌తో అల్లు అర్జున్‌

    దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్‌ మరణంతో సినీలోకం విషాదంలో కూరుకుపోయింది. అయితే కళాతపస్వి, అల్లు అర్జున్‌తో ఉన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

    కేసీఆరే నాకు స్ఫూర్తి; కుమారస్వామి

    తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తాజాగా రాయచూర్‌లో జరిగిన పంచరత్న [రథయాత్ర](url)లో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మిషన్ భగీరథ ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టి దాదాపు 14 జిల్లాలకు నీరు అందిస్తున్నారని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే తెలంగాణ తరహా పాలన అందిస్తానని పేర్కొన్నారు. #Telangana like schemes will be implemented … Read more

    FPO విత్ డ్రాపై వివరణ ఇచ్చిన అదానీ

    పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(FPO)ని ఉపసంహరించుకోవడంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్వెస్టర్లను ఉద్దేశించి అదానీ చేసిన ప్రసంగించారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మార్కెట్ అస్థిరతల దృష్ట్యా FPOను కొనసాగించడం నైతికత కాబోదని అభిప్రాయపడ్డారు. కంపెనీ బ్యాలన్స్‌షీట్ పక్కాగా ఉందని వెల్లడించారు. మార్కెట్ పరిస్థితులన్నీ మెరుగు పడ్డాక క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి సారిస్తామని తెలిపారు.

    ‘దేశంలోనే బెస్ట్ సీఎం జగన్’

    భారతదేశంలోనే వైఎస్ జగన్ గొప్ప సీఎం అని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ అన్నారు. నిక్ ప్రస్తుతం ఏపీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా [సీఎం జగన్‌](url)ను కలిశారు. అనంతరం రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి నిక్ స్పందించారు.‘‘రాష్ట్రంలో విద్యారంగం తీరు అద్భుతంగా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమావ అవకాశాలు కల్పిస్తున్నారు. జగన్ లాంటి వ్యక్తిని నేనింత వరకూ చూడలేదు. ఉన్నత ఆశయంతో పని చేస్తున్నారు.’’ అంటూ కొనియాడారు. మఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలవడం గౌరవంగా … Read more

    కోలుకుంటున్న తారకరత్న; ఎంపీ విజయసాయిరెడ్డి

    నందమూరి తారకరత్న కోలుకుంటున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని విజయసాయి తెలుసుకున్నారు. బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్నను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చెప్పారు. కాగా తారకరత్నకు విజయసాయిరెడ్డి మామ వరుస అవుతారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలి కూతురే అలేఖ్య.

    మంచుతుపాను బీభత్సం, ఇద్దరు మృతి

    [VIDEO:](url) జమ్ము కశ్మీర్‌లో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. గుల్మర్గ్‌ ప్రాంతంలో ఒక్కసారిగా కమ్మేయటంతో ఇద్దరు విదేశీయులు మృతిచెందారు. మరో 19 మందిని సురక్షితంగా కాపాడారు. మంచు కమ్మేస్తున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఇటీవల తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న బారాముల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 19 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. Sad to learn about the #Avalanche that hit the #Gulmarg skiing resort. … Read more

    తిరుమలలో మరో అపచారం

    తిరుమలలో మరో అపచారం జరిగింది. తిరుమల మాడ వీధుల్లో సీఎంఓ స్టిక్కర్ ఉన్న ఓ ఇన్నోవా వాహనం [హల్‌చల్](url) చేసింది. అక్కడి భద్రతాధికారులు దానిని చూసి చూడనట్లు వదిలేశారు. దీనిపై భక్తులు టీటీడీ భద్రతా సిబ్బందిపై మండిపడుతున్నారు. కాగా నిబంధనల ప్రకారం మాడ వీధుల్లోకి వాహనాలు నిషేధం. టీటీడీ చైర్మన్, ఈఓ వాహనాలు కూడా ఇక్కడికి రావు. వీవీఐపీలు కూడా బ్యాటరీ బగ్గీల్లో మాడవీధుల్లో తిరుగుతారు. అలాంటిది ఈ వాహనాన్ని ఎలా అనుమతించారనేది అంతుబట్టడం లేదు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం… తిరుమల మాడ … Read more