సాయిధరమ్ తేజ్ టైటిల్ గ్లింప్స్
సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి చిత్రబృందం గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న సినిమాలో సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గ్లింప్స్‌కు తారక్ వాయిస్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటోంది.