పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఐదు రోజుల పాటు పరుగుల వరద పారిన పిచ్‌పై ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. చివరి వికెట్ తీసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. నసీమ్ షా, మహ్మద్ అలీ 8.5 ఓవర్లు వికెట్ పడకుండా పోరాడారు. ఒక్క వికెట్ తీసేందుకు బ్యాట్స్‌మెన్ చుట్టూ ఏకంగా 11 మంది[ ఫీల్డర్లు](url) నిలబడ్డారు. చివరకు జాక్ లీచ్ బౌలింగ్‌లో నసీమ్ షా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగటంతో ఇంగ్లాండ్‌ను విజయం వరించింది.