• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ మ్యాచ్

    వన్డే వరల్డ్‌కప్‌లో కీలక జట్లు పోరాటాలకు సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతుండగా, ఉదయం న్యూజిలాండ్‌.. పాకిస్థాన్‌తో తలపడబోతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి తర్వాత బలంగా పుంజుకుని ఆసీస్ వరుసగా నాలుగు విజయాలు సాధించింది. అయితే గాయంతో మ్యాక్స్‌వెల్‌, వ్యక్తిగత కారణాలతో మిచెల్‌ మార్ష్‌ దూరం కావడం ఆ జట్టును దెబ్బ తీసేదే. మరోవైపు 6 మ్యాచ్‌ల్లో 5 ఓడి దాదాపుగా సెమీస్‌కు దూరమైన ఇంగ్లాండ్‌ పరువు కోసం పోరాడనుంది.

    దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు

    నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. క్వింటన్ డికాక్, వాన్‌డర్‌ డసెన్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటి దక్షిణాఫ్రికా బ్యాటర్లు 82 సిక్స్‌లు కొట్టారు. దీంతో 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేరిట ఉన్న 76 సిక్స్‌ల రికార్డును దక్షిణాఫ్రికా అధిగమించింది. డికాక్‌ 18, క్లాసెన్ 17, మిల్లర్ 14, మార్కో జాన్‌సెన్ 9, మార్‌క్రమ్ 8, వాన్‌డర్‌ డసెన్ 7 చొప్పున … Read more

    ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు?

    వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈరోజు లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. హార్దిక్‌ స్ధానంలో సూర్యకుమార్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా లక్నో వికెట్‌కు స్పిన్‌కు అనుకూలించే అవకామున్నందున మహ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చి రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

    ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు?

    వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. రేపు లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే రేపటి మ్యాచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. హార్దిక్‌ స్ధానంలో సూర్యకుమార్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా లక్నో వికెట్‌కు స్పిన్‌కు అనుకూలించే అవకామున్నందున మహ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చి రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

    ఇంగ్లాండ్ ఆటగాళ్లపై గంభీర్ విమర్శలు

    ఇంగ్లండ్‌ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శల చేశారు. జట్టులో చాలా మంది ఆటగాళ్లు తమ పరువు కోసం ఆడుతున్నారని అభిప్రాయపడ్డారు. జో రూట్ అవుట్ అయిన తర్వాత చాలా చెత్త షాట్లు ఆడి వికెట్‌ను పారేసుకున్నారని తెలిపారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. అందుకే వారు విజయం సాధించారు” అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో గంభీర్‌ పేర్కొన్నాడు.

    ఇంగ్లాండ్‌ జట్టుకు మాజీ కెప్టెన్‌ చురకలు

    ఇంగ్లాండ్‌ క్రికెట్ జట్టు సభ్యులకు ఆ దేశ మాజీ కెప్టెన్ నాసిర్‌ హుస్సేన్ చురకలు అంటించాడు. జట్టును సన్నద్ధత విషయంలో భారత జట్టును చూసి ఇంగ్లాండ్ చూసి నేర్చుకోవాలని సూచించాడు. అలాగే ఈ వరల్డ్‌ కప్‌ ముందు వన్డే ఫార్మాట్‌ మ్యాచ్‌లను ఆడలేకపోవడం ఇంగ్లాండ్‌ ఓటములకు కారణం కావచ్చని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌ నుంచి గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆటతీరును చూడలేదన్నాడు. ఆల్‌రౌండర్లను ఎక్కువగా నమ్ముకున్న ఫలితం దక్కలేదని నాసిర్ పేర్కొన్నాడు.

    ENG vs SL: ఇంగ్లాండ్ ఆలౌట్

    ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లాండ్‌ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు జానీ బెయిర్‌స్టో (30), డేవిడ్ మలన్ (28) జోరూట్ (3,) జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్‌స్టోన్ (1) ఘోరంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 2, ఏంజెలో మాథ్యూస్‌ 2, కాసున్ రజిత ఒక్కో వికెట్ పడగొట్టారు.

    RSA vs ENG: దక్షిణాఫ్రికా ఘన విజయం

    ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లాండ్ దక్షిణఫ్రికా తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది. ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 22 ఓవర్లలోనే పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా 229 పరుగుల తేడాతో భారీ విజయాన్నిఅందుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు బెయిర్‌ స్టో (10), డేవిడ్‌ మలాన్‌ (6) రూట్‌ (2), బెన్‌ స్టోక్స్‌ (5) హ్యారీ బ్రూక్‌ (17), జోస్‌ బట్లర్‌ (15), బెయిర్‌స్టో మాత్రమే చేయగలిగారు.

    RSA vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు

    ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. దక్షిణాఫ్రిక బ్యాటర్లు ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ (4) రీజా హెండ్రిక్స్‌ (85), వాండర్‌ డసెన్ (60) హెన్రిచ్‌ క్లాసెన్ (109), ఐడెన్ మార్‌క్రమ్ (42) జాన్సన్ (60) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లు రీస్ టోప్లీ (3) ఆదిల్ రషీద్ (2) … Read more

    ENG vs BAN: ఇంగ్లాండ్ విజయం

    బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ భారీగా పరుగులు రాబట్టింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ప్రారంభంలోనే బంగ్లా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (74) రహీమ్ (51) హృదయ్ (39) పరుగులు చేసి పర్యాలేదనిపించారు.