• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పాకిస్తాన్‌కు భారత్ నోటీసులు; పాక్ మొండి వైఖరి

  సింధు నదీ జలాల పంపకం విషయంలో పాకిస్తాన్‌కు భారత్ నోటీసులు పంపింది. పాకిస్తాన్ మొండి వైఖరి కారణంగానే ఈ నోటీసులు పంపినట్లు ఇండియా పేర్కొంది. ఈ నోటీసుతో 3 నెలల్లోగా భారత్-పాక్‌లు చర్చలు నిర్వహించాల్సి ఉంటుంది. గత 5 ఏళ్లుగా కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల సమస్యలు చర్చించేందుకు పాక్ చర్చలకు నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ నోటీసులు పంపింది. కాగా 1960లో నెహ్రూ-ఆయూబ్ ఖాన్‌ల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది.

  పాతాళానికి పడిపోయిన పాకిస్తాన్‌ రుపీ

  ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోతోంది. గురువారం డాలర్‌కు 255 రుపీలతో రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. ఒక్కరోజులోనే పాక్‌ కరెన్సీ 24 రుపీలు పతనమైంది. మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.డబ్బు ఆదా చేయడంతో పాటు కరెన్సీ మారకపు రేటు విధానాన్ని సరళతరం చేస్తోంది.

  పాక్ కుదేలు; దారుణంగా పడిపోయిన రూపాయి విలువ

  పాకిస్తాన్‌లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఆర్థిక సంక్షోభం వల్ల ఆ దేశ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. ప్రస్తుతం రూ.24 మేర క్షీణించి రూ.225కు చేరింది. పాకిస్తాన్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో క్షీణించడం ఇదే తొలిసారి. మరోవైపు పాకిస్తాన్‌లో విదేశీ మారక నిల్వలు పూర్తిగా పడిపోయాయి. తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. భారీగా డబ్బు చెల్లించి కొనాలన్నా ఆహారం దొరకటం లేదు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది.

  ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 10శాతం కోత

  ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌ డబ్బు ఆదా చేసుకునేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. ఇప్పటికే కరెంటు కోతలు ఇతర మార్గాల ద్వారా మిగుల్చుకుంటున్న సర్కారు..తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వోద్యోగుల జీతభత్యాల్లో 10 శాతం కోత పెట్టాలని యోచిస్తోంది. మంత్రుల ఖర్చులను 15 శాతం తగ్గించాలని, సహాయక మంత్రులు, సలహాదారులను 78 నుంచి 30కి కుదించాలని భావిస్తోంది. ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ఏర్పాటుచేసిన జాతీయ వ్యయ నియంత్రణ కమిటీ.. ఈ మేరకు నివేదిక ఇవ్వనుంది.

  అంథకారంలో పాకిస్తాన్

  దాయాది దేశం పాకిస్తాన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు. జాతీయ గ్రిడ్‌లో వోల్టేజీలో హెచ్చుతగ్గుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అక్కడి విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కాగా దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని పేర్కొన్నారు. కాగా గతేడాదిలో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

  ‘డీ కంపెనీ’ని కలసిన సలీం ఫ్యామిలీ; ఎన్ఐఏ

  భారత్ నుంచి కొంతమంది ‘డీ కంపెనీ’ని కలసినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీటులో పేర్కొంది. 2013లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఛోటా షకీల్ కూతురి నిశ్చితార్ధానికి షకీల్ బావమరిది మహ్మద్ సలీం ఖురేషి కుటుంబం దుబాయ్ నుంచి కరాచీకి అక్రమంగా వెళ్లినట్లు ఎన్ఐఏ తెలిపింది. అక్కడే 5 రోజులపాటు షకీల్ ఇంట్లో వీరు మకాం వేశారని పేర్కొంది. అనంతరం కరాచీ నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి భారత్ వచ్చినట్లు తేలింది.

  కిలో చికెన్ రూ. 383, పప్పు రూ. 228

  పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపు దాల్చింది. రికార్డుస్థాయి ద్రవ్యోల్బణం, తరిగిపోతున్న విదేశీ నిల్వలతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో నిత్యావసరాల ధరలు అక్కడి సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గోధమపిండి కొరత, బియ్యం, పాలు, చమురు ధరలు 40-50 శాతం పెరిగాయి. కిలో ఉల్లి ధర రూ. 220, చికెన్ కిలో రూ. 383, పప్పు ధాన్యం రూ. 228కి చేరింది. కిలో బాస్మతి బియ్యం రూ. 146, పాలు రూ. 150కి ఎగబాకాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  పాకిస్థాన్‌లో వంటనూనె ధరకు రెక్కలు

  పాకిస్థాన్‌లో వంటనూనె, నెయ్యి ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో వీటి ధరలు ప్రియం అయ్యాయి. మరోవైపు దిగుమతులు కూడా భారమవుతుండటం పాకిస్థాన్ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఇప్పటికే లీటరు నూనెపై రూ.30 వరకు ధరలు పెరిగాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరో రూ.20 వరకు పెరిగే అవకాశం ఉంది. దాదాపు 90శాతం వంటనూనెలు దిగుమతులపైనే ఆధారపడుతున్న పాకిస్థాన్.. నిధుల కొరతతో సతమతమవుతోంది. కస్టమ్స్ గోదాముల్లో 3.58లక్షల టన్నుల వంటనూనె నిల్వ ఉన్నట్లు సమాచారం. అయితే, బ్యాంకులు ఎల్‌వోసీ … Read more

  పాకిస్థాన్‌ పొదుపు ప్రణాళికలు

  ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కొత్తగా ఇంధన పొదుపు ప్రణాళికలను ప్రకటించారు. ఇందులో భాగంగా రాత్రి 8.30 గం.లకే మార్కెట్లు, 10 గంటలకు వివాహ వేదికలను మూసివేయనున్నారు. దీనివల్ల 60 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు ఆదా అవుతాయట. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బులు… జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తి నిలిపివేసి మరో 37 బిలియన్లు ఆదా చేయనున్నారు. ప్రభుత్వ భవనాల్లో విద్యుత్‌ను 30 శాతం ఆదా చేసేందుకు యోచిస్తున్నారు.

  ఇంటర్ పరీక్షల్లో ప్రముఖ సింగర్ పాటలు; వీడియో వైరల్

  పాకిస్తాన్‌కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి పరీక్షలో జవాబులకు బదులుగా సినిమా పాటలు రాశాడు. ఇందుకు సంబంధించిన పరీక్షా పేపర్లు వైరల్‌గా మారాయి. ఓ విద్యార్థి ప్రముఖ సింగర్ అలీ జాఫర్ పాడిన ‘ఝూమ్’ పాటలను ఫిజిక్స్ పేపర్లో జవాబులుగా రాశాడు. ఇన్విజిలేటర్ గమనించి పేపర్లన్నింటినీ [వీడియో](url) తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై అలీ జాఫర్ స్పందించాడు. ‘‘ఫిజిక్స్ అన్ని చోట్లా ఉంటుంది. అలాగే నా పాటల్లో కూడా ఉంటుంది.’’ అంటూ చమత్కరించాడు. یہ وائرل وڈیو وٹسُ … Read more