• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భుజంపై భార్య మృతదేహంతో భర్త.. మోసుకుంటూ నడక

    భార్య మృతదేహాన్నితీసుకెళ్లడానికి అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక ఓ భర్త తన [భుజం](url)పై 4 కి.మీ మోసుకెళ్లాడు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా గంట్యాడ వద్ద చోటుచేసుకుంది. ఓడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన ఈడె సాములు, గురులు భార్యభర్తలు. గురు అనారోగ్యంతో బాధపడుతుండగా ఏపీలోని తగరపువలసలో ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఆటోలో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో గురు తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. ఆటో డ్రైవర్ మృతదేహాన్ని దించి వేసి వెళ్లిపోయాడు. దీంతో సాములు దగ్గర డబ్బులు లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని 4 కి.మీ నడిచాడు. గంట్యాడ పోలీసులు గమనించి వారికి అంబులెన్స్ ఏర్పాటు చేసి స్వగ్రామానికి తరలించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv