డేవిడ్ మిల్లర్:
ఈ రోజు అందరి కళ్లు ఈ సఫారి ప్లేయర్ మీదే. ఇప్పటి వరకు చాలా జట్లకు ఆడిన మిల్లర్ ఈ సారి మాత్రం గుజరాత్ తరఫున అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు 449 పరుగులు చేసిన ఈ బ్యాటర్ క్రీజులోకి వచ్చాడంటే చాలు ఎవరికైనా సరే బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. ఈ ప్లేయర్ సిక్సర్ల సునామీకి బౌలర్లంతా చేష్టలూగి ఉండిపోతారు. ఇప్పటికే పలు మ్యాచుల్లో తన సత్తా ఏంటో చూపెట్టిన ఈ ఆటగాడి మీదే అందరి దృష్టి ఉంది.
శుభ్‌మన్ గిల్:
ఈ భారత యువబ్యాటర్ మీద అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. తనదైన రోజున సంచలనాలు చేయగల ఈ యువ బ్యాటర్ ఇప్పటికే ఈ సీజన్ ఐపీఎల్లో తనదైన మార్కు చూపెట్టాడు. ఇప్పటికే ఐపీఎల్లో 438 పరుగులు చేసిన ఈ బ్యాటర్ మీద అందరి కళ్లు ఉన్నాయడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఓపెనర్ గా వచ్చి మ్యాచులను తారుమారు చేయగల సత్తా ఈ బ్యాటర్ కు ఉంది.
హార్దిక్ పాండ్యా
పోయిన సీజన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన ఈ యంగ్ ఆల్ రౌండర్ ను ఈ సారి గుజరాత్ జట్టు డ్రాఫ్ట్ లో తీసుకుని అతడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పంది. కెప్టెన్ గా తనదైన ముద్ర వేస్తూ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఈ యంగ్ కెప్టెన్ ఇప్పటికే ఐపీఎల్ లో 453 పరుగులు చేశాడు. ఈ భయంకర కెప్టెన్ ఈ రోజు ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో?
జాస్ బట్లర్
ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ ను సాధించిన ఈ ఓపెనర్ బ్యాటర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బట్లర్ క్రీజులో ఉన్నాడంటే చాలు బంతి బౌండరీ లోపలి కంటే బయటే ఎక్కువ ఉంటుందని చాలా మంది చెబుతారు. ఇప్పటికే తన మార్కును చూపెట్టిన బట్లర్ ఈ సీజన్ లో ఆరు సెంచరీలు చేశాడు. ఇప్పటికే 824 పరుగులు చేసిన బట్లర్ తనదైన రోజున ఎన్నో సంచలనాలు చేయగలడు. సెకండ్ క్వాలిఫయర్ లో సెంచరీ చేసి తన జట్టును ఫైనల్ కు చేర్పించాడు. ఇతడు క్రీజులో ఉంటే రాజస్థాన్ అభిమానులకు పండగ. గుజరాత్ అభిమానులకు ఫ్రస్టేషన్.
సంజూ శాంసన్
ఐపీఎల్లో రాజస్థాన్‌ను లీడ్ చేస్తున్న ఈ యంగ్ బ్యాటర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సిక్సులు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే సంజూ ఈ ఫైనల్ లో ఎలా ఆడుతాడా? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కెప్టెన్‌గా రాణిస్తున్న సంజూ బ్యాటర్ గా 444 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ రోజు ఎలా ఆడతాడా? అని అంతా ఎదురు చూస్తున్నారు.
షిమ్రన్ హెట్మెయర్
ఈ విండీస్ భయంకరుడు తనదైన రోజున సిక్సర్ల సునామీ తెప్పించగలడు. పోయిన సీజన్ లో ఢిల్లీకి ఆడిన ఈ హార్డ్ హిట్టర్ ఈ సారి రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో కొన్ని మ్యాచుల్లో సిక్సర్ల సునామీ తెప్పించిన షిమ్రన్ ఈ మ్యాచ్ ఎలా ఆడతాడో.. ఎంతటి విధ్వంసం చేస్తాడో. ఇప్పటికే ఈ అరవీర భయంకరుడు 303 పరుగులతో ఆడుతున్నాడు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?