• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD: రామ్‌చరణ్‌ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్‌.. డైరెక్టర్‌ ప్లాన్‌ అదేనా?

    పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ జోరు ఒక్కసారిగా పెంచింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన AI వెహికల్‌.. బుజ్జిని ప్రముఖ నగరాల్లో తిప్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ను బుజ్జి వెహికల్‌ను నడపాలని కోరి వరల్డ్‌ వైడ్‌గా సినిమాపై అటెన్షన్‌ తీసుకొచ్చింది. ఇక తాాజాగా మరో కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రమోషన్స్‌ను మేకర్స్‌ షురూ చేశారు. 

    క్లింకారకు స్పెషల్‌ గిఫ్ట్‌

    సరికొత్త ప్రమోషన్స్‌కు కల్కి టీమ్‌ నాంది పలికింది. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు  గిఫ్ట్‌లు పంపుతోంది. తాజాగా రామ్‌ చరణ్‌ కుమార్తె క్లీంకారకు (Klinkaara) మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి – భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌, ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపనున్నట్లు తెలుస్తోంది. 

    చిన్నారులపై ఫోకస్‌

    సాధారణంగా ఏ సినిమా మేకర్స్‌ అయినా రిలీజ్‌ సందర్భంగా యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తుంటారు. అయితే కల్కి టీమ్‌ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ వైపు పెద్దలను ఆకర్షిస్తూనే చిన్నారులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిన్నారులపైనే ఫుల్‌గా ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. ఇటీవల కిడ్స్‌ను టార్గెట్‌ చేస్తూ ‘బుజ్జి అండ్‌ భైరవ’ (Bujji And Bhairava) పేరుతో సరికొత్త యానిమేషన్‌ సిరీస్‌ను తీసుకొచ్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా ఈ సిరీస్‌ రెండు ఎపిసోడ్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చిన్నారులను ఎంటగానో ఆకర్షిస్తోంది. అటు పెద్దల నుంచి సైతం సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా స్పెషల్‌ గిఫ్ట్స్‌ ప్రోగ్రామ్‌ను కూడా పిల్లల కోసమే లాంచ్ చేశారు. 

    కారణం ఇదేనా!

    ‘కల్కి 2898 ఏడీ’ సైంటిఫిక్‌ అండ్‌ ఫ్యూచరిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన బుజ్జి, భైరవ సిరీస్‌, గ్లింప్స్‌ను పరిశీలిస్తే కల్కి చిత్రం సూపర్‌ హీరోల కాన్సెప్ట్‌ను తలపిస్తోంది. సాధారణంగా ఈ తరహా చిత్రాలు.. పెద్దల కంటే పిల్లలనే ఎక్కువగా అట్రాక్ట్‌ చేస్తుంటాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో వచ్చిన అవెంజర్స్, మార్వెల్‌ సిరీస్‌ చిత్రాలు ఈ విషయాన్నే రుజువు చేశాయి. కాబట్టి కల్కి టీమ్‌ కూడా ఆ పాయింట్‌నే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా పిల్లల్లో కల్కి సినిమాపై ఆసక్తి రగిలిస్తే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులను కూడా థియేటర్లకు రప్పించవచ్చని మూవీ టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. అటు యూత్‌, టీనేజర్స్‌ను ఆకర్షించడానికి ప్రభాస్ ఉండనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది. 

    కల్కి రన్‌టైమ్‌ లాక్‌?

    ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రన్‌ టైమ్‌ ఫిక్స్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రీసెంట్‌ సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం.. ఈ సినిమా నిడివిని 3.10 గం.లుగా మేకర్స్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని ప్రచారం జరుగుతోంది. అయితే రన్‌టైమ్‌పై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv