సలార్ (Salaar) తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్ న్యూస్ బయటకొచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు డబ్బింగ్? (Mahesh Babu Dubbing)
కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు ‘భైరవ’ అని చిత్ర యూనిట్ ఇప్పటికే రివీల్ చేసింది. అయితే ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్‌ను ఉపయోగించుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్‌కు మహేష్ వాయిస్ ఇస్తే సినిమాపై హైప్ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయమై మహేష్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో ఇలాగే..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇలా డబ్బింగ్ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్ చెప్పిన అనుభవం ఉంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సంజయ్ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్‌తో చక్కటి ఎలివేషన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్ చేత ఎలాగైన డబ్బింగ్ చెప్పించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్ ‘SSMB29’ సినిమా షూట్ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్‌కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి.
కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.
‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!