రామారావు ఆన్ డ్యూటీ: జులై 29
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ జులై 29న విడుదల కానుంది. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపుడి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
విక్రాంత్ రోణ: జులై 28
కన్నడ హృరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేసిన స్పెషల్ సాంగ్ రా రా రక్కమ్మ సాంగ్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. జులై 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ది లెజెండ్ : జులై 28
ఇటీవల కాలంలో శర్వణన్ “ది లెజెండ్ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ట్రైలర్ కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. “ది లెజెండ్” జూలై 28న అన్ని ప్రధాన భాషలలో విడుదల అవుతుంది.
ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు:
సినిమా | భాష | ఓటీటీ | రిలీజ్ డేట్ |
రాకెట్రీ | పాన్ ఇండియా | ప్రైమ్ వీడియో | జులై 26 |
ది బ్యాట్‌మ్యాన్ | పాన్ ఇండియా | ప్రైమ్ వీడియో | జులై 27 |
777 చార్లీ | పాన్ ఇండియా | వూట్ సెలక్ట్ | జులై 29 |
19(1)(a) | మలయాళం | డిస్టీ+హాట్‌స్టార్ | జులై 29 |
గుడ్‌లక్ జెర్రీ | హిందీ | డిస్టీ+హాట్‌స్టార్ | జులై 29 |
షికారు | తెలుగు | ఆహా | జులై 29 |
పేపర్ రాకెట్ | తమిళ్, తెలుగు | జీ5 | జులై 29 |