• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అదిరిపోయిన ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటిస్’

  మాస్ మహారాజ రవితేజ హీరోగా, శరత్ మండవ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్’ అనే వీడియోను విడుదల చేశారు. ఫుల్ మాస్‌గా ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక … Read more

  థియేట‌ర్‌లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీమ్ ముచ్చ‌ట్లు

  ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ జులై 29న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం వ‌రుస‌గా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటుంది. తాజాగా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌, ర‌వితేజ‌, వేణు తొట్టెంపుడి ఒక సినిమా థియేట‌ర్‌లో కూర్చొని రామారావు ఆన్ డ్యూటీ గురించి ముచ్చ‌టించారు. డైరెక్ట‌ర్ ప్ర‌శ్న‌లు వేస్తుండ‌గా ర‌వితేజ, వేణు ఫ‌న్నీగా స‌మాధానాలు చెప్తూ ఎంట‌ర్‌టైన్ చేశారు.

  ఈ వారం ఓటీటీ/ థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే తెలుగు సినిమాలు

  రామారావు ఆన్ డ్యూటీ: జులై 29 మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ జులై 29న విడుద‌ల కానుంది. ర‌జిషా విజ‌య‌న్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత వేణు తొట్టెంపుడి ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విక్రాంత్ రోణ‌: జులై 28 క‌న్న‌డ హృరో కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ‌. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత‌ ఈ యాక్ష‌న్ … Read more

  రామారావు ఆన్ డ్యూటీ టిక్కెట్ల రేట్లు ఫిక్స్

  రామారావు ఆన్ డ్యూటీ టిక్కెట్ల రేట్లు ఖరారయ్యాయి. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ శరత్ మండవ ఈ మేరకు వెల్లడించారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో టెక్కెట్ ధర రూ.195, సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, రూ.100, రూ.50గా నిర్ణయించారు. ఏపీలో రూ.177, రూ.147, రూ.80గా ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రూ.30 ఎక్కువ తీసుకుంటారని పేర్కొన్నారు. కొంచెం కష్టమైనా థియేటర్‌కి వెళ్లి కౌంటర్‌లో టికెట్‌ తీసుకోవాలని సూచించారు. ఇక ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది.

  గెస్టుగా పిలిచారని రాలేదన్న హీరో నాని

  గెస్టుగా పిలిచారని రాలేదు. రవి అన్న గురించి మాట్లాడే అవకాశం వస్తుందని వచ్చానని హీరో నాని అన్నారు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రి రిలీజ్ వేడుకలో నాని ఈ విధంగా పేర్కొన్నారు. రవితేజకు చిరు అంటే ఇష్టమని, తనను చూసి స్పూర్తి పొందారని చెప్పారు. ప్రతి జనరేషన్లో ఒకరుంటారని, మా అందరికీ రవి అన్న ఇన్స్పిరేషన్ అన్నారు. చిరు క్యారెవ్యాన్ లోకి రవితేజ ఎంటరైన విధంగా, రవితేజ క్యారెవ్యాన్ లోకి త్వరలోనే వెళతానని నాని ఆశాభావం వ్యక్తం చేశాడు. 20 ఏళ్ల … Read more

  ‘ఇన్ స్టా పిక్స్ వల్లే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యా’

  రామారావు ఆన్ డ్యూటీలో యాక్ట్ చేసిన ఉత్తారాఖండ్ ముద్దుగుమ్మ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను హీరో రవితేజకు వీరాభిమానని చెప్పుకొచ్చింది. ఈ మూవీతో అభిమాన హీరోతో నటించాలన్న కోరిక తీరినట్లు వెల్లడించింది. కోవిడ్ సమయం తర్వాత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చీరతో ఉన్న పిక్స్ డైరెక్టర్ శరత్ చూసి తనకు ఫోన్ చేసినట్లు చెప్పింది. ఆ క్రమంలో స్టోరీ చెప్పగా తన క్యారెక్టర్ నచ్చి ఓకే చెప్పినట్లు తెలిపింది. మాస్ మహారాజా షూటింగ్లో ఎంతో ఎనర్జీ, … Read more

  ‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజ్

  ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ ప‌వ‌ర్‌ఫుల్ సాంగ్‌ను ల‌వితా లోబో పాడారు. శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిచాడు. ర‌జిషా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా న‌టించారు. వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాకు శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం జులై 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్ల‌పై ఘాటుగా స్పందించిన ర‌వితేజ‌

  ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జులై 29న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌తో క‌లిసి ర‌వితేజ సినిమా విశేషాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా షూటింగ్ స‌మ‌యంలో మీకు నిర్మాత‌కు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఏవో గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి అది నిజ‌మేనా అని యాంక‌ర్ అడిగింది. దీనిపై స్పందించిన ర‌వితేజ ప‌నిపాట లేనివాళ్లు ఇష్టం వ‌చ్చిన‌వి వాళ్లు ఊహించుకొని రాస్తారు. నేను వాళ్ల‌ను ప‌ట్టించుకోను అలాంటి రూమ‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు న‌వ్వుకొని వ‌దిలేస్తాను అని … Read more

  రామారావ్ ఆన్ డ్యూటీ ట్రైలర్ గ్లింప్స్ రెడీ

  మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఎల్లుండి విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.ఈమేరకు 9సెకన్ల నిడివి గల ట్రైలర్ గ్లింప్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. The tricky officer 'RamaRao' is coming your way ?#RamaRaoOnDuty … Read more