New Telugu Movies on OTT: వీకెండ్‌లో సినిమాల జాతర.. ఈ మూవీస్‌ అస్సలు మిస్‌ కావొద్దు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New Telugu Movies on OTT: వీకెండ్‌లో సినిమాల జాతర.. ఈ మూవీస్‌ అస్సలు మిస్‌ కావొద్దు!

    New Telugu Movies on OTT: వీకెండ్‌లో సినిమాల జాతర.. ఈ మూవీస్‌ అస్సలు మిస్‌ కావొద్దు!

    September 19, 2024

    ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీకెండ్‌ కూడా తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. మీకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచనున్నాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    తంగలాన్‌

    తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా ‘తంగలాన్’ (Thangalaan). ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. త‌మిళం, తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఒకే రోజు అందుబాటులోకి రానుంది. ప్లాట్ ఏంటంటే ‘తంగలాన్‌ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్‌ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్‌ బంగారాన్ని ఎలా సాధించాడు?’ అన్నది స్టోరీ.

    మారుతీ నగర్ సుబ్రమణ్యం

    మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రం సెప్టెంబర్‌ 20న ఓటీటీలోకి రానుంది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో వీక్షించవచ్చు.  ప్రముఖ నటుడు రావు రమేశ్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ టాక్ దక్కింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఆగస్టు 23న థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కూడా ముఖ్యమైన పాత్రలు చేశారు. ప్లాట్‌ ఏంటంటే ‘సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని సంకల్పించి మరో పని చేయకుండా సుబ్రమణ్యం ఖాళీగానే ఉంటాడు. భార్య సంపాదనపై జీవిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి. ఆ డబ్బు ఎవరిది? సుబ్రమణ్యంకు జాబ్‌ వచ్చిందా? లేదా? అతడి కొడుకు అంకిత్‌ లవ్ ట్రాక్ ఏంటి?’ అన్నది స్టోరీ.

    తిరగబడరా సామి

    రాజ్‌త‌రుణ్‌, మాల్వీ మ‌ల్హోత్రా హీరో హీరోయిన్లుగా న‌టించిన ‘తిర‌గ‌బ‌డ‌రా సామీ’ (Thiragabadara Saami) మూవీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ‘గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ ఉంటాడు. ప్రేయసి శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్‌ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. శైలజాను కంట్రోల్‌ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? ఎప్పుడూ సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది?’ అన్నది స్టోరీ.

    హంట్

    మ‌ల‌యాళం హార‌ర్ మూవీ ‘హంట్’ (Hunt) థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 వేదికగా సెప్టెంబ‌ర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మ‌ల‌యాళం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాజీ కైలాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆగ‌స్ట్ 29న థియేట‌ర్ల‌లో రిలీజైన హంట్ పర్వాలేదనిపించింది. ప్లాట్‌ ఏంటంటే ‘కీర్తి (భావ‌న‌) ఫోరెన్సిక్ డాక్ట‌ర్. ఓ మ‌హిళా హ‌త్య కేసుకు సంబంధించిన ఆధారాల్ని క‌నిపెట్టే బాధ్య‌త కీర్తిపై ప‌డుతుంది. ఆ కేసు ఇన్వేస్టిగేష‌న్ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి కీర్తి జీవితంలో అంతుచిక్క‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఓ ఆత్మ ఆమెను వెంటాడుతుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవ‌రిది? చ‌నిపోయిన మ‌హిళ‌కు కీర్తికి ఉన్న సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. 

    సోపతులు

    సోపతులు చిత్రం నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. సెప్టెంబర్‌ 19 నుంచి ఈటీవీ విన్‌ వేదికగా ప్రసారం అవుతోంది.  తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో దర్శకుడు అనంత్‌ వర్ధన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. భాను ప్రకాశ్, శృజన్, మోహన్ భగత్, అనూష రమేశ్, మణి అయిగుర్ల, అంజయ్య మిల్కూరి ప్రధాన పాత్రలు చేశారు. ‘సోపతులు గ్రామంలోని స్కూల్‌లో ఇద్దరు బాలలు చదవుకుంటూ ఉంటారు. క్రికెట్‌, గోలీలు ఆడుతూ సంతోషంగా జీవిస్తుంటారు. అనూహ్యంగా కరోనా లాక్‌డౌన్‌ వచ్చి వారు విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆన్‌లైన్‌ క్లాసుల కోసం మెుబైల్‌ కొనేందుకు తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? విడిపోయిన స్నేహితులు ఎంత బాధపడ్డారు?’ అన్నది స్టోరీ.

    ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్

    అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island). ఈ సిరీస్ సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. ప్లాట్‌ ఏంటంటే ‘మోక్ష ఐల్యాండ్ లోని ప్రతి జీవాన్ని, ప్రతి మార్గాన్ని డాక్టర్ విశ్వక్ సేన్ సృష్టిస్తాడు. అలాంటి దీవిలోకి అడుగుపెట్టిన ఆయన వారసులకు అనూహ్యమైన ఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఏంటి? వారసులనే ఎందుకు టార్గెట్ చేశారు? దాని వెనక ఎవరున్నారు?’ అన్నది స్టోరీ.

    వాజా

    మలయాళ కామెడీ డ్రామా చిత్రం ‘వాజా: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్’. ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇందులో సిజు సన్నీ, జోమోన్ జ్యోతియార్, అమిత్ మోహన్ లీడ్‌ రోల్స్‌లో నటించారు. ఈ చిత్రానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 23న హాట్‌స్టార్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ప్లాట్ ఏంటంటే ‘జీవితంలో ఎలాంటి లక్ష్యం పెట్టుకోకుండా ఐదుగురు స్నేహితులు జులాయిగా జీవిస్తుంటారు. అయితే వారి తల్లిదండ్రులు మాత్రం వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వయసు పెరుగుతున్న కొద్ది తల్లిదండ్రుల్లో ఆందోళన మెుదలవుతుంది. మరి ఆ ఐదుగురు ఫ్రెండ్స్ జీవితంలో సక్సెస్‌ అయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ.

    లెవెల్ క్రాస్

    అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్‌ అయూబ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆసిఫ్‌ అలీ హీరోగా న‌టించాడు. సెప్టెంబ‌ర్ 27 నుంచి సోనీలివ్‌లో ఈ చిత్రం ప్రసారం కానుంది. చైతాలి (అమ‌లాపాల్‌) ట్రైన్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ ర‌ఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి త‌న‌కు పెళ్లి అయిన‌ట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ. 

    ఆయ్‌ (Aay)

    గత వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇప్పటికీ వాటిని చూడకుంటే ఈ వీకెండ్‌లో చూసేయండి. జూ.ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ హీరోగా నయన్‌ సారిక  హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘ఆయ్‌‘. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. రూ.5కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.14కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సెప్టెంబర్‌ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘కార్తీక్, సుబ్బు, హరి బాల్య స్నేహితులు. వర్క్ ఫ్రమ్ హోం కోసం ఊరికి వచ్చిన కార్తీక్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకే కులం అని భావించి కార్తీక్‌ను కూడా పల్లవి ఇష్టపడుతుంది. అయితే నిజం తెలిసి అతడ్ని వదిలేసి ఇంకో పెళ్లికి రెడీ అవుతుంది. వారిద్దరిని కలిపేందుకు సుబ్బు, హరి ఎలాంటి పాట్లు పడ్డారు? చివరికీ వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ.

    కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)

    నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు‘ ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్‌ 12 నుంచి ఈటీవీ విన్‌ వేదికగా ప్రసారం అవుతోంది. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, త్రినాథ్ వర్మ లీడ్ రోల్స్ చేశారు. రూ.5కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.17 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయింది. ప్లాట్‌ ఏంటంటే ‘పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి జాతర నిర్వహిస్తారు. జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు ఉండటంతో సర్చంచ్‌ బుజ్జి (సాయి కుమార్)పై శివ (సందీప్‌ సరోజ్‌) బరిలోకి దిగుతాడు. గత జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఉత్సవం పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? స్నేహితులు తిరిగి కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ.

    తలవన్‌ (Thalavan)

    మలయాళంలో వచ్చిన రీసెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌‘. బిజు మీనన్‌, ఆసీఫ్ అలీ హీరోలుగా నటించిన ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించింది. సెప్టెంబర్‌ 10 నుంచి సోని లివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఎస్‌ఐ కార్తిక్‌ వాసుదేవన్‌ (ఆసిఫ్‌ అలీ) ట్రాన్స్‌ఫర్‌పై సీఐ జయశంకర్‌ (బిజు మీనన్‌) స్టేషన్‌కు వస్తాడు. కార్తిక్‌ది దూకుడు మనస్తత్వం కావడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. ఈ క్రమంలో ఓ రోజు జయశంకర్‌ ఇంటి మేడపై యువతి శవం దొరుకుతుంది. ఈ హత్య జయశంకర్‌ చేశాడని పోలీసులు అంతా నమ్ముతారు. ఇంతకీ రమ్యను ఎవరు చంపారు? ఈ నేరంలో జయశంకర్‌ ఎలా చిక్కుకున్నాడు? ఈ కేసును కార్తిక్‌ ఏ విధంగా సాల్వ్‌ చేశాడు? అన్నది స్టోరీ. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version