ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్స్‌లో క్రొయేషియాపై ఊహించని పరాజయంతో బ్రెజిల్ ఇంటిబాట పట్టింది. పెనాల్టీ షూటౌవుట్‌లో గోల్స్ కొట్టలేక ఓడిపోయింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు సెమీస్‌కు చేరుకోలేకపోయింది. దీంతో బ్రెజిల్ ఆటగాడు నెయిమర్ కన్నీటి పర్యంతమయ్యాడు. మైదానంలోనే [ఏడ్చిన](url) అతడిని జట్టు సభ్యులు ఓదార్చారు. మ్యాచ్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమం కావటంతో పెనాల్టీ షూట్‌ఔట్‌కి వెళ్లారు. అందులో క్రొయోషియా 4 గోల్స్ కొట్టగా..బ్రెజిల్ 2 మాత్రమే చేయగలిగింది.