ఫుట్బాల్లో వైట్ కార్డ్ ? దీని అర్థం?
ఫుట్బాల్ ఆటలో యెల్లో, రెడ్ కార్డు గురించి చాలామందికి తెలుసు. కానీ, ఇప్పుడు కొత్తగా వైట్ కార్డును ప్రవేశ పెట్టారు. పోర్చుగల్లో జరిగిన వుమెన్స్ కప్లో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. బెన్ఫికా, లిస్బన్ మధ్య జరిగిన మ్యాచ్లో హాఫ్ టైమ్ ముగిసిన తర్వాత రిఫరీ వైట్ కార్డ్ చూపించాడు. ప్రస్తుతం దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇది ఎందుకు చూపిస్తారంటే? ఆటలో నిబంధనలు ఉల్లంఘించకుండా ఫెయిర్ ప్లే ఆడినందుకు చూపిస్తారు.