ఈ వారం రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush). శ్రీ విష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul RamaKrishna) హీరోలుగా.. హుషారు (Hushaaru) మూవీ ఫేమ్ శ్రీ హర్ష కనుగొంటి (Sri Harsha Kanugonti) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రమోషన్స్ కూడా భిన్నంగా చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో శ్రీ విష్ణు ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు.
‘ఆ దెబ్బతో ప్రాఫిట్స్ వచ్చేశాయ్’
‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ చూసినవారంతా ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. ఇదిలా ఉంటే హీరో శ్రీవిష్ణు.. ఈ సినిమా విడుదలకు ముందే నాలుగు రెట్లు ప్రాఫిట్స్ యూవీ క్రియేషన్స్ వారికి వచ్చాయని వ్యాఖ్యానించారు. తన గత హిట్ చిత్రం ‘సామజవరగమన’ తాలూకా పాజిటివ్ ఫ్యాక్టర్.. అలాగే ఇప్పుడు ‘ఓం భీం బుష్’ తాలూకా క్రియేటివ్ టీజర్, ట్రైలర్ కంటెంట్‌ల దెబ్బతో నిర్మాతలకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేశాయని లేటెస్ట్ ఇంటర్వ్యూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. విడుదలకు ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్స్ తీసుకొస్తే రిలీజయ్యాక ఎన్ని రికార్డ్స్ బద్దలు అవుతాయో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సెన్సార్ పూర్తి
‘ఓం భీమ్ బుష్’ చిత్రం.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్టు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గం.ల 15 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను అన్ని వయస్సుల వారు నిరభ్యంతరంగా చూడవచ్చని పేర్కొంది. అయితే మూవీ చూస్తున్నంత సేపు సెన్సార్ సభ్యులు కూడా నవ్వుతూనే ఉన్నారని టాక్. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శ్రీ హర్ష ఈ కథకి కామెడీ, హారర్ టచ్ ఇవ్వడంతో పాటు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ జత చేసినట్లు సమాచారం. ఇది ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
శ్రీవిష్ణు ఖాతా మరో హిట్?
‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓమ్ బీమ్ బుష్’. సెన్సార్ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్ పడేలా కనిపిస్తోంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓం భీమ్ బుష్’ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందా? లేదా? అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం