వీకెండ్ వస్తుందంటే చాలు సినిమా లవర్స్ అలర్ట్ అయిపోతారు. ఏ ఓటీటీల్లో ఏమేం కొత్త సినిమాలు వస్తున్నాయోనని తెగ సెర్చ్ చేస్తుంటారు. అలాంటి వారికి ఈ వీకెండ్ పండగే అని చెప్పవచ్చు. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు కొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. ఐదు తెలుగు చిత్రాలు, ఒక డబ్బింగ్ ఫిల్మ్ మీకు వినోదాన్ని అందించేందుకు అహ్వానిస్తున్నాయి. అలాగే ఒక మోస్ట్ వాంటెడ్ సిరీస్ కూాడా ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఐసీ814: ది కాందహార్ హైజాక్
ప్రపంచంలోనే అతిపెద్ద హైజాక్‌గా నిలిచిన ఓ రియల్ స్టోరీ ఆధారంగా ‘ఐసీ814: ది కాంధార్ హైజాక్’ (IC 814 The Kandahar Hijack) సిరీస్ రూపొందింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 29వ తేదీ నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. పైలెట్‌ను బెదిరించి అఫ్గనిస్తాన్‌లోని కాందహార్‌లో విమానాన్ని ల్యాండ్ చేయిస్తారు. ఈ క్రమంలో విమానంలోని 188 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది పరిస్థితి ఏంటి? వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది?’ అన్నది స్టోరీ.
బడ్డీ
అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా నటించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ మూవీ ‘బడ్డీ’ (Buddy). సామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 2న థియేటర్లలలో విడుదలైంది. నెల రోజులు కాకముందే ఆగస్ట్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఆదిత్య రామ్ (అల్లు శిరిష్) పైలెట్‌గా చేస్తుంటాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పల్లవిని చూడకుండానే ప్రేమిస్తాడు. ఓ రోజు పల్లవి మెడికల్ మాఫియా వలలో చిక్కుకొని కిడ్నాప్ అవుతుంది. కోమాలోకి వెళ్లిన ఆమె ఆత్మ టెడ్డీలోకి ప్రవేశిస్తుంది. విలన్ల వద్ద ఉన్న తన బాడీని ఆదిత్య సాయంతో ఎలా పొందింది?’ అన్నది స్టోరీ.
పురుషోత్తముడు
యంగ్ హీరో రాజ్‌తరుణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). రామ్ భీమన దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్‌గా చేసింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. తాజాగా ఆగస్టు 29 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘రామ్ (రాజ్ తరుణ్) పుట్టుకతో కోటీశ్వరుడు. సీఈవోగా బాధ్యతలు చేపట్టే సమయానికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. 100 రోజులు సామాన్యుడిలా జీవించాల్సి అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రాయపులంక గ్రామానికి రామ్ చేరుకుంటాడు. అక్కడికి వెళ్లాక రామ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? గ్రామస్తుల కోసం రామ్ చేసిన సాహసాలు ఏంటి?’ అన్నది స్టోరీ.
సారంగదరియా
టాలీవుడ్‌లో సహాయక పాత్రలు పోషిస్తూ ప్రముఖ నటుడిగా రాజా రవీంద్ర గుర్తింపు పొందారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya Movie). జూలై 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఆగస్టు 31 నుంచి ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘కృష్ణ కుమార్ కాలేజీ లెక్చరర్. ఇద్దరు కొడుకులు బాధ్యత లేకుండా తిరుగుతుంటారు. కూతురు అనుపమ ట్రాన్స్ గర్ల్ అన్న నిజం అందరికీ తెలియడంతో కృష్ణ కుమార్ ఫ్యామిలీ అల్లరిపాలవుతుంది. అసలు అనుపమ గతం ఏంటి? పిల్లల జీవితాలను కృష్ణప్రసాద్ ఎలా చక్కదిద్దాడు?’ అన్నది స్టోరీ.
హనీమూన్ ఎక్స్‌ప్రెస్
చైతన్యరావు , హెబ్బా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తనికేళ్ల భరణి, సుహాసిని, అలీ, రవి వర్మ ముఖ్యపాత్రలు పోషించారు. ఆగస్టు 27 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఇషాన్, సోనాలి పెళ్లైన కొత్త జంట. భిన్నమైన మనస్తత్వాలు ఉండటంతో తరచూ వీరి కాపురంలో గొడవలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ సీనియర్ కపుల్స్.. వీరికి హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే గేమ్ గురించి చెప్తారు. ఏంటా గేమ్? దాని వల్ల ఇషాన్, సోనాలి ఎలా దగ్గరయ్యారు? ఇంతకీ గేమ్‌ను సూచించిన సీనియర్ జంట ఎవరు?’ అన్నది కథ.
ప్రభుత్వ జూనియర్ కళాశాల
ప్రణవ్ ప్రీతమ్, షాజ్ఞశ్రీ వేణు హీరో హీరోయిన్లుగా నటించిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమా జూన్ 21వ తేదీన థియేటర్లలో రిలీజైంది. శ్రీనాథ్ పులకూరం ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆగస్టు 26 నుంచి ఈ చిత్రం ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్ వాసు తోటి విద్యార్థిని కుమారిని ప్రేమిస్తాడు. కుమారి గురించి కొన్ని విషయాలు తెలిసి ఆమెతో వాసు గొడవపడతాడు. ఆపై ఆత్మహత్యకు యత్నిస్తాడు. అసలు వాసు ఎందుకు చనిపోవాలని అనుకున్నాడు? కుమారి గురించి ఏం తెలుసుకున్నాడు?
గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్
హాలీవుడ్‌లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ (Godzilla x Kong: The New Empire) చిత్రం ఈ వారం ఓటీటీలో తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 29 నుంచి జియో సినిమాలో ప్రసారంలోకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘భూమిని అంతం చేయడానికి వచ్చిన ఒక టైటాన్‌ను గాడ్జిల్లా, కాంగ్ కలిసికట్టుగా ఎలా ఆపాయి? గాడ్జిల్లా, కాంగ్‌లతో మనుషులు ఎలాంటి బంధాన్ని ఏర్పరుచుకున్నారు? ఇంతకీ కాంగ్ ఎవర్ని వెతుకుతుంది? గాడ్జిల్లా పవర్ పెంచుకునేందుకు ఎందుకు యత్నించింది?’ అన్నది కథ.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్