వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్ – రష్మిక డీప్ లవ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.
‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్ డాగ్ ఫొటోల్లో విజయ్ పెట్ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్మార్ట్ (విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్ కో-స్టోర్ ఎవరు అని ఆనంద్ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్ తీసుకొని “ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్ వెంటనే రౌడీ, రౌడీ స్టార్ అని అరడవంతో రౌడీ బయ్ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక – ఆనంద్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్లారిటీ ఇచ్చేసినట్లేనా?
రష్మిక లేటెస్ట్ కామెంట్స్‌తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్‌పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్‌తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో విజయ్, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్‌వి కావడంతో వారు డేట్‌లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్ – రష్మిక రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
మెంటల్ క్యారెక్టర్ చేయాలి: రష్మిక
ఆనంద్ దేవరకొండకు ‘బేబీ’ (Baby) ద్వారా బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ ‘నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్ క్యారెక్టర్ అయినా మీ డైరెక్షన్‌లో చేయాలనిపించింది’ అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘గం గం గణేశా’ రిలీజ్ ఎప్పుడంటే?
ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, బిగ్ బాగ్ ఫేమ్ ప్రిన్స్ యావర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’