ఆర్‌ఆర్‌ఆర్ తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. ఇటీవలె ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా విడుదలై మార్చి 25 నాటికి సంవత్సరం పూర్తయ్యింది.
సంవత్సర కాలంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రానికి దాదాపు 60 పురస్కారాలు వచ్చాయి.
సినిమా విడుదలై సంవత్సరం పూర్తైన సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటుంది. ఆర్‌ఆర్‌ఆర్ గెలుచుకున్న అవార్డులు ఇందులో ఉన్నాయి.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’పాటకు పురస్కారం వచ్చింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు నాటుకి గోల్డెన గ్లోబ్ అవార్డు కూడా ఇచ్చారు.
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి నిలిచారు.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్‌కు స్పాట్ లైట్ అవార్డులు వచ్చాయి.
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ సియాటిల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు ఆర్‌ఆర్‌ఆర్‌కు వచ్చింది.
ఉత్తమ విదేశీ భాష చిత్రం, బెస్ట్ సాంగ్ విభాగంలో క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాలు లభించాయి. లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఉత్తమ సంగీతం అవార్డు కైవసం చేసుకుంది ఈ సినిమా. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆన్‌లైన్ టాప్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యింది.
బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫీచర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఉత్తమ స్టంట్స్‌కు గాను హౌస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు వరించింది. ఉత్తమ విదేశీ భాష చిత్రంగా సెలబ్రీటీ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్