టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత రూత్ ప్రభు ఒకరు. అనారోగ్యం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఏదోక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సమంత్ లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ నవంబర్ 7న ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత దుమ్మురేపిందని చెప్పవచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లో హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా అదరగొట్టింది. దీంతో సామ్ పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే సిరీస్ కోసం సామ్ పెద్ద మెుత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెమ్యూనరేషన్ ఎంతంటే?
సమంత (Samantha), వరుణ్ ధావన్ (Varun Dhawan) లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’ (Citadel: Honey Bunny). హనీ పాత్రలో సమంత యాక్ట్ చేస్తే బన్ని పాత్రలో వరుణ్ ధావన్ యాక్ట్ చేశారు. సమంత తొలిసారి తన కెరీర్లో స్పై పాత్రలో కనిపించబోతోంది. ఇందుకోసం సామ్ తనను తాను ఎంతో మౌల్డ్ చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ సైతం తీసుకుంది. ఇదిలా ఉంటే సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం భారీ మెుత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10 కోట్ల మేర సమంత డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ కోసం సమంత రూ.5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ సిరీస్‌కు రెట్టింపు తీసుకున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం తెలుగులోని చాలా మంది హీరోలు, హీరోయిన్లతో పోలిస్తే సమంత రెమ్యూనరేషన్ ఎక్కువనే చెప్పవచ్చు.
ఆ సిరీస్‌తో సామ్ క్రేజ్ పీక్స్!
సమంత గతంలో ఫ్యామిలీ మాన్ 2 అనే వెబ్ సిరీస్ చేసింది. 2021లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. ఇందులో సమంత తన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది. కెరీర్లో తొలిసారి యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టింది. నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న ఆమె నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే సిటాడెల్: హనీ బన్నీ సిరీస్‌ను సైతం ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులే తెరకెక్కిస్తుండటం విశేషం ఆ సిరీస్‌లోని రాజీ పాత్రతో పోలిస్తే హనీ పాత్రలో యాక్షన్ డోస్ మరింత ఎక్కువగా ఉండనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 240 పైగా దేశాల్లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నారు.
నేను చెత్త నటినే: సమంత
‘సిటాడెల్: హనీ బన్ని’ ట్రైలర్లో సమంత ఏజెంట్ కావడానికి ముందు నటి కావాలని ప్రయత్నించినట్లు చూపించారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడింది. తన మెుదటి సినిమా ఆడిషన్‌ను గుర్తుచేసుకుంది. ‘నా తొలి చిత్రం ఏ మాయ చేశావే సమయంలో జరిగిన ఆడిషన్‌కు సిటాడెల్లో జరిగిన ఆడిషన్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ఈ వెబ్ సిరీస్‌లో చెత్తనటిగా నటించాలి. అందుకు అనుగుణంగా బాగా నటించా. ఎందుకంటే ఇప్పటికీ నేను సగభాగం చెత్త నటినే. ఇప్పటికీ నేను అలానే ఉన్నాను. నేను నా బెస్ట్ ఇచ్చానంటే క్రెడిట్ అంతా నాకు మాత్రమే సొంతం కాదు. సరైన టీమ్ చేతుల్లో పడ్డప్పుడే మనలోని మంచి నటన బయటకు వస్తుంది’ అని సామ్ అన్నారు.
సిరీస్‌లో అదే హైలెట్!
‘సిటాడెల్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులోని క్లైమాక్స్ మరో స్థాయిలో ఉంటుందని పేర్కొన్నాడు. ‘ఈ సిరీస్‌లో ఓ యాక్షన్ సన్నివేశం కోసం నేను, సమంత అవిశ్రాంతంగా పనిచేశాం. ఎంతో కష్టపడ్డాం. ఆ సన్నివేశం 11 నిమిషాలు ఉంటుంది. సింగిల్ టేక్‌లో ఎలాంటి కట్స్ లేకుండా దాన్ని చిత్రీకరించాం. ఇది సిరీస్ క్లైమాక్స్‌లో వస్తుంది. కచ్చితంగా ఎంతో ఉత్కంఠ కలిగిస్తుంది’ అని వరుణ్ అన్నాడు. దీంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సిటాడెల్ సిరీస్ ఇండియాలో ఏ స్థాయిలో అటెన్షన్స్ తీసుకువస్తుందోనని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం