Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?

    Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?

    December 7, 2024

    అతి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్‌ చేసింది. రవితేజ, రామ్‌, బాలకృష్ణ, నితీన్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, మహేష్‌ బాబు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. రీసెంట్‌గా ‘పుష్ప 2’ చిత్రంలో కిస్సిక్‌ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఈ యంగ్‌ బ్యూటీ ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. యంగ్‌ హీరోతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 ద్వారా ఈ విషయం తేటతెల్లమైందని అంటున్నారు.

    ఆ హీరో ఎవరంటే?

    ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha)లో అన్‌స్టాపబుల్‌ అనే టాక్‌ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాల్గవ సీజన్‌లో భాగంగా 6వ ఎపిసోడ్‌ను ఓటీటీ వర్గాలు తాజాగా రిలీజ్‌ చేశాయి. ఇందులో యంగ్ హీరో శ్రీలీల (Sreeleela)తో పాటు యువ కథానాయకుడు నవీన్‌ పోలిశెట్టి పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు ఎంతో ఫ్రీడమ్‌తో జోకులు వేసుకుంటూ సందడి చేశారు. అయితే వీరిద్దరు ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ ఇంత క్లోజ్‌గా ఉండటంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుర్ర హీరోతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అటు నవీన్‌ పొలిశెట్టి సైతం ఈ షోలో శ్రీలీలతో చాలా చనువుగా కనిపించారు. ఆమెపై సెటైర్లు వేస్తూ ఆధ్యంతం షోను రక్తి కట్టించాడు. దీనికి తోడు ఎంతో మంది యువ హీరో, హీరోయిన్లు ఉండగా వీరిద్దరినే షోకు పిలవడం వెనక కారణం ఇదే అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గతంలో జరిగిన జీ తెలుగు మహోత్సవం వేడుకల్లో ఈ శ్రీలీల, నవీన్‌ పోలిశెట్టి పాల్గొన్నారు. మనిద్దరం కలవడం ఇదే తొలిసారి కదా అని శ్రీలీల అనగా చివరిసారి మాత్రం కాదులే అంటూ పోలిశెట్టి అంటాడు. ఈ డైలాగ్‌తో ఈవెంట్‌కు వచ్చిన వారంతా బిగ్గరగా కేకలు వేస్తారు. 

    చేతికి మూడు ఫ్యాక్చర్స్‌.. 

    ‘అన్‌స్టాబబుల్‌ సీజన్‌ 4’ పాల్గొన్న నవీన్‌ పోలిశెట్టి తనకు జరిగిన యాక్సిడెంట్‌ గురించి బాలయ్యతో మాట్లాడారు. తనకు పెద్ద యాక్సిడెంట్‌ జరిగిందని, చేతికి ఏకంగా మూడు ఫ్యాక్చర్లు అయినట్లు నవీన్ తెలిపాడు. పూర్తిగా రికవరీ కావడానికి కనీసం 8 నెలలు పడుతుందని డాక్టర్‌ చెప్పారన్నారు. దీంతో ఆ గ్యాప్‌లో కథలు వినడం ప్రారంభించానని, త్వరలో ‘అనగనగా ఒక రాజు’ స్టోరీ రాబోతున్నట్లు చెప్పాడు. బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘రామాయణ’లో నటిస్తున్నారన్న రూమర్లపైనా అతడు స్పందించాడు. ఇలాంటివి వినడానికి చాలా బాగుంటాయని, నిజమైతే ఇంకా బాగుండు అని వ్యాఖ్యానించాడు. ఇలాంటి రూమర్స్ ఇంకా స్ప్రెడ్ చేస్తేనైనా అలాంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌లో అవకాశం లభిస్తుందేమోనని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. కాగా, హిందీ రామయణలో లక్షణుడిగా నవీన్‌ పోలిశెట్టి ఎంపికైనట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 

    రానాకు శ్రీలీల బంధువా?

    ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి టాక్‌షో అమెజాన్‌ ప్రైమ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇటీవల సెకండ్‌ ఎపిసోడ్‌ రిలీజ్‌ కాగా అందులో శ్రీలీల, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొని రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో మీరు మాకు బంధువులు అవుతారా? అంటూ శ్రీలీల (Sreeleela)ను రానా అడుగుతాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో మీవాళ్లు తగులుతున్నట్లు చెబుతాడు. ఈ క్రమంలో తన అమ్మది ఒంగోలు దగ్గర ఓ విలేజ్ అని శ్రీలీల చెబుతుంది. అప్పుడు రానా కూడా తన తాతది ఒంగోలు జిల్లానే అంటూ బదులిస్తాడు. కాగా, దిగ్గజ నిర్మాత, రానా తాత డి. రామానాయుడుది ప్రకాశం జిల్లాలోని కారంచేడు ప్రాంతం. ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో దూరపు చుట్టరికం ఉండి ఉండొచ్చని ఫిల్మ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

    శ్రీలీల మాకు రిలేటివ్స్‌: డైరెక్టర్‌

    బాలయ్య హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు శ్రీలీల దగ్గరి బంధువు అవుతుందని సీక్రెట్ రివీల్ చేశారు. శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని చెప్పారు. అదే ఊరు తన అమ్మమ్మది కూడా అని అనిల్‌ తెలిపారు. శ్రీలీల తల్లి స్వర్ణ తనకు అక్క వరుస అవుతుందని ఆయన అన్నారు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుందన్నమాట. భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందు డైరెక్టర్ గారు అని తనను శ్రీలీల పిలుస్తుందని, ఎవరూ లేనప్పుడు మాత్రం ‘మామయ్య’ అంటూ ఆట పట్టిస్తుందని కూడా చెప్పారు. కాగా, శ్రీలీల పుట్టింది తెలుగు నేలపైనే అయినా పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే. ఆమె తన అమ్మమ్మ ఊరు పొంగులూరుకు ప్రతీ ఏటా వస్తుంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version