• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిపోయిన ‘ఆటోమేటిక్ దర్వాజా’ సాంగ్

    సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ మూవీ తాజాగా ‘ఆటోమేటిక్ దర్వాజా’ అనే ఓ ఐటెం సాంగ్ విడుదలైంది. వినసొంపుగా ఉన్న ఆ సాంగ్ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

    సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ఈ వారం విడుదల కాబోతోంది. సెప్టెంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు.నాగచైతన్య సహా పలువురు యువ తారలు అతిథులుగా హాజరవుతున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

    ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. విశ్వ‌క్ ఏమ‌న్నాడంటే

    యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ గురించి మాట్లాడాడు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని సినిమా వాళ్ల గురించి కొంత‌మందికి ఉండే ఆ చిన్న‌చూపు అంశాన్ని లేవ‌నెత్తార‌ని చెప్పాడు. ఈ పాయింట్‌ను క‌రెక్ట్‌గా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చెప్పి ఉంటాడ‌ని అనుకుంటున్నా అన్నాడు. సెప్టెంబ‌ర్ 16న అంద‌రూ త‌ప్ప‌కుండా ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూడాల‌ని కోరాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించారు.

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్

    సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ఈ ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఒక అమ్మాయిని క‌ష్ట‌ప‌డి సినిమాలో న‌టించేందుకు డైరెక్ట‌ర్‌ ఒప్పిస్తాడు. కానీ ఆమె తండ్రికి అది ఇష్టం లేక‌పోవ‌డంతో సినిమా మ‌ధ్య‌లో ఆగిపోతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అత‌డి సినిమా క‌ల నేర‌వేరిందా లేదా అనే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కిన‌ట్లుగా తెలుస్తుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ … Read more

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సాంగ్ రిలీజ్

    సుధీర్‌బాబు, కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్న మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ మూవీ నుంచి కొత్త‌కొత్త‌గా అనే రొమాంటిక్ సాంగ్‌ను నేడు విడుద‌ల చేశారు. వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సింగ‌ర్స్ చైత్ర‌, అభ‌య్ క‌లిసి పాడారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. సెప్టెంబ‌ర్ 16న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.