ఆలియా భట్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తన అద్భుత నటనతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. మార్చి 15న ఆమె పుట్టినరోజు జరుపుకుంటోంది. కాగా ఈ గంగుభాయి వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. ‘ఎడ్ ఎ మమ్మా’ అనే బట్టల కంపెనీ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.150 కోట్లుగా ఉంది. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఆలియా నికర ఆస్తుల విలువ దాదాపుగా రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు తీసుకుంటుందని టాక్.