• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బేబీ’ హీరోయిన్‌కు బంపరాఫర్

    ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం. హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్‌వీసీసీ సంస్థ నిర్మిస్తున్నట్లు టాక్. మరో వైపు ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిశ్ రెడ్డి సరసన ఓ మూవీలో నటిస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఈ చిత్రాన్ని అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు క్లిక్ అవుతే వైష్ణవి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

    అందరినీ గుర్తు పెట్టుకుంటా: వైష్ణవి చైతన్య

    తన కెరీర్‌లో సాయపడిని ప్రతి ఒక్కరినీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య అన్నారు. ‘‘యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు నేను పెద్ద స్టార్ అవుతానని అందరూ అంటుండేవారు. నాకు ఆ సత్తా, టాలెంట్ ఉందని చెప్పేవారు. ఇలా నాకు అండగా నిలిచిన అందరికీ థ్యాంక్స్. నా జర్నీలో ఉన్న ఘటనలు, మనుషులను ఎప్పటికీ మర్చిపోను. నన్ను బేబీ సినిమాలో ఇంతలా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు.’’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

    ‘బేబీ’ నటికి లైంగిక వేధింపులు!

    తనను కొందరు లైంగికంగా వేధించారంటూ ‘బేబీ’ సినిమా నటి కిరాక్ సీత వాపోయింది. ‘‘ఇటీవల నేను ఓ ఈవెంట్‌కు వెళ్లివస్తుండగా కొందరు కుర్రాళ్లు వెంటపడ్డారు. నన్ను రేప్ చేస్తాం.. చంపేస్తాం అని బెదిరించారు. నా అడ్రెస్ తెలుసుకోవటానికి ప్రయత్నించారు. కానీ నేను దీనిని లైట్ తీసుకున్నాను. నన్ను అంతలా వేధించిన వారిపై ఫిర్యాదు చేయకపోవడానికి కారణం ఉంది. నా రీల్ లైఫ్ క్యారెక్టర్ చూసి వాళ్లు వేధించారు. నా రియల్ లైఫ్ వాళ్లకు తెలీదు కదా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    బిగ్‌బాస్‌లోకి ‘బేబీ’ హీరోయిన్!

    ‘బేబీ’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బిగ్‌బాస్‌లోకి అడుగుపెడుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. బేబీ సినిమా హిట్‌తో వైష్ణవి పేరు మోరుమోగుతోంది. దీంతో ఆమె క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బ్యాంకాక్ పిల్ల శ్రావణి, శోభాశెట్టి, సింగర్ మోహన భోగరాజు, అమర్‌దీప్ చౌదరి, తేజస్విని, శ్వేతా నాయుడు, దీపికా పిల్లి, సింగర్ మంగ్లీ, జబర్దస్త్ అప్పారావు, క్రికెటర్ వేణుగోపాలరావు తదితరులు బిగ్‌బాస్ 7లో సందడి చేయనున్నట్లు టాక్.

    ఆ సినిమా చూశాక కన్నీళ్లు ఆగలేదు: రష్మిక

    ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా తెరకెక్కిన ‘బేబీ’ మూవీ చూశాక కన్నీళ్లు ఆగలేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలిపింది. ‘‘బేబీ సినిమా నాకెంతో నచ్చింది. ఈ చిత్రంలోని సీన్స్ నా మదిలో ఎంతోకాలం నిలిచిపోతాయి. నటీనటులందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. వాళ్ల యాక్టింగ్ నాతో కన్నీళ్లు పెట్టించింది.’’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా బేబీ సినిమా విడుదలైన తొలి రోజే రూ.7.1 కోట్ల గ్రాస్ రాబట్టింది.