• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 39 మందితో బీజేపీ తొలి జాబితా

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీ హైకమాండ్‌కు చేరింది. దీని ఆధారంగా ఈనెల 14 తర్వాత 39 మందితో కూడిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గంలో యాక్టీవ్‌గా ఉన్న వారికి తొలి జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. కాగా, రేపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్, రాజేంద్రనగర్‌లో సభలు నిర్వహించాల్సి ఉండగా.. ఆదిలాబాద్ సభ మాత్రమే నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

    ‘మా నాన్నకు టికెట్‌ ఇవ్వొద్దు’

    రాజస్థాన్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భాజపా మాజీ ఎమ్మెల్యే జయరామ్‌ జాటవ్‌కు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వవద్దని స్వయంగా ఆయన కూతురే అదిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చింది. ఒకవేళ టికెట్‌ ఇస్తే తన తండ్రిపై రెబల్‌గా తానే బరిలోకి దిగుతానని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను హెచ్చరించింది. తన ఆస్తులను కొట్టేసేందుకు తన తండ్రి కుట్రలు చేస్తున్నారని మీనా జాటవ్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సొంత కొడుకునే జయరామ్‌ చంపాలని చూశారని ఆమె ఆరోపించారు.

    బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్

    క్యాసినో కింగ్‌గా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరారు. బర్కత్‌పూరలోని బీజేపీ కార్యాలయంలో చీకోటి పార్టీ కండువా కప్పుకున్నారు. అతడిని బీజేపీ నేత డీకే అరుణ, ప్రవీణ్‌కు పార్టీ కండువా కప్పి సాధర ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

    ఈ నెల 10న తెలంగాణకు అమిత్ షా

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 10న తెలంగాణ రానున్నారు. ఆయన ఒకే రోజు రెండు సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 10న ఉదయం ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడలో జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. త్వరలో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

    ఎన్డీయేలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి?: పవన్

    కైకలూరు వద్ద ముదినేపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ‘టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు తీరుస్తాం. నేను ఎన్డీయే కూటమితో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? వైసీపీకి ఎందుకు అంత భయం. మేము గెలిచిన రోజున దమ్ముంటే వైసీపీ నేతలు ఇళ్లలోనో ఆఫీసుల్లోనో కూర్చోండి చూద్దాం. ఏ పోలీసులతో కేసులు పెట్టించారో అదే పోలీసులతో మక్కెలు ఇరగతీయిస్తాం. భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ప్రజలు ఆస్తి ప్రతాలు జగన్ చేతుల్లో ఉంటాయి’. అని పవన్ ఆరోపించారు.

    రాహుల్‌‌ గాంధీని రావణుడితో పోల్చిన బీజేపీ

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ రాహుల్ ఫొటో కింద క్యాప్షన్‌తో బీజేపీ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. ‘మోదీ ఒక అబద్ధాల కోరు ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదు’ … Read more

    కాంగ్రెస్‌కు అధికారమే ముఖ్యం: మోదీ

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకు పైనే ఎక్కువ ద‌ృష్టి సారిస్తుందని విమర్శించారు. రైతులు, జవాన్ల సంక్షేమాన్ని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సీఎం గెహ్లాట్ అవినీతి బయటకు రావాలంటే రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

    బీజేపీ, జనసేన పొత్తుపై కీలక ప్రకటన

    జనసేనతో పొత్తుపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పొత్తుపై పవన్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారని చెప్పారు. పవన్‌ అభిప్రాయంపై వెంటనే స్పందించలేమన్నారు. పవన్ విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని పురందేశ్వరి పేర్కొన్నారు.

    మోదీపై ఫోన్ విసిరేసిన దుండగుడు

    కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. మైసూరులో మోదీ పాల్గొన్న మెగా రోడ్ షోలో భద్రతా వైఫల్యం తలెత్తింది. ప్రజలకు అభివాదం చూస్తుండగా ఓ వ్యక్తి ప్రధానిపైకి ఫోన్ విసిరేశారు. అయితే, విసిరేసిన ఫోన్ వాహనం ముందు పడటంతో ప్రధాని కొద్దిలో తప్పించుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఈ రోడ్ షోకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. Security breach during PM Modi's Karnataka … Read more

    కలలో కూడా అనుకోలేదు: కిరణ్‌కుమార్

    [VIDEO:](url) కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అన్ని రాష్ట్రాల్లో క్రమంగా కనుమరుగైందని అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తంతు ఉండేదని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ సూక్తిని ప్రస్తావించారు. ‘మా రాజు చాలా తెలివైనవాడు. ఎంతంటే.. సొంతంగా ఆలోచించలేనంత. ఇతరుల సూచనలు స్వీకరించలేనంత’ అంటూ హైకమాండ్ వైకరిని వివరించారు. ఢిల్లీలో బీజేపీలో చేరిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH | "I had … Read more