• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాషాయం కండువా కప్పుకున్న కిరణ్‌కుమార్

    [VIDEO:](url) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ కుమార్ సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. రాజకీయాల్లో స్తబ్దుగా ఉంటూ వస్తున్న కిరణ్ కుమార్ ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్‌కు రాజీనామా చేసి యూటర్న్ తీసుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కిరణ్ కుమార్.. ప్రభుత్వ చీఫ్ విప్, స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2010 నుంచి 2014వరకు సీఎంగా పనిచేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంద్ర పార్టీని స్థాపించి.. కాంగ్రెస్‌లో విలీనం చేశారు. #WATCH … Read more

    బీజేపీలో మున్నాబాయ్ ఎంబీబీఎస్‌లు: కేటీఆర్

    TS: మోదీ విద్యార్హతపై కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు తీర్పు అనంతరం కేటీఆర్ [ట్వీట్](url) చేశారు. చూస్తుంటే బీజేపీలో చాలామంది మున్నాబాయ్ ఎంబీబీఎస్‌లు ఉన్నట్లు ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి కూడా ఇద్దరు ఎంపీలకు నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఒకరు తమిళనాడు, మరొకరు రాజస్థాన్ యూనివర్సిటీల నుంచి పట్టా పొందారని విమర్శించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఇలా తప్పుడు విద్యార్హతను చూపించడం నేరం కాదా? దోషులుగా తేలితే లోక్‌సభ స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటిస్తారా? అంటూ ప్రశ్నించారు. Looks like we have … Read more

    కేంద్రమంత్రిపై బెంగాల్‌లో రాళ్ల దాడి

    [VIDEO:](url)కేంద్ర మంత్రి నిశిత్ ప్రామాణిక్‌పై బెంగాల్‌లో రాళ్ల దాడి జరిగింది. కూచ్‌బెహార్ జిల్లాలో మంత్రి కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ని ప్రయోగించారు. బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై నిశిత్ ప్రామాణిక్ స్పందించారు. టీఎంసీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారని విమర్శించారు. #WATCH | West Bengal: The convoy of Nisith Pramanik, MoS Home … Read more

    దిల్లీ మేయర్‌ ఎన్నిక గందరగోళం

    [VIDEO:](url) దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక రసాభాసగా మారింది. మేయర్‌ ఎన్నికకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారి నియామకంలో లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఆప్‌ విమర్శలు చేస్తూ నిరసనకు దిగింది. ఈ క్రమంలో ఆప్‌, భాజపా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్వల్పంగా తోపులాట జరగటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా కంచుకోటను బద్ధలు కొడుతూ ఆప్‌ 134 స్థానాల్లో విజయం సాధించింది. కమలం పార్టీకి 104 స్థానాలు దక్కాయి. #WATCH | Delhi: Chaos continues at Civic Center … Read more

    ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

    హైదరాబాద్‌లో ఎంపీ అరవింద్‌ ఇంటివద్ద తీవ్ర [ఉద్రిక్తత](url) చోటుచేసుకుంది. కవిత కాంగ్రెస్‌లో చేరతానంటూ మల్లిఖార్జున ఖర్గేకు కాల్‌ చేసిందంటూ నిన్న అరవింద్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ ఇంటిముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ఇంట్లోకి దూసుకెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌, కిటీకీలు, కారు అద్దాలు పగులగొట్టారు. దాడి సమయంలో అరవింద్‌ ఇంట్లో లేరు. #TRS cadre attack the #BJP MP Aravind's residence at #Hyderabad and not him. Sorry!!!#Telangana https://t.co/Avbq9BQwf3 — Sagar KV ?  … Read more

    మునుగోడులో బీజేపీకి నిరసన సెగ

    TS: మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వేళ.. బీజేపీకి నిరసన సెగ తగిలింది. ప్రచారంలో BJP అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురవుతోంది. సంస్థాన్ నారాయణపురంలోని గుజ్జ, కోతులాపురం గ్రామస్థులు నిరసన తెలిపారు. ప్రచారాన్ని అడ్డుకొని తమ గ్రామానికి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదంటూ రాజగోపాల్‌రెడ్డిని నిలదీశారు. కాగా, రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు బీజేపీకి తలనొప్పిగా మారాయి. ఐపాయ్ మునుగోడు ఉపఎన్నికల సందర్బంగా సంస్థాన్ నారాయణపురం గుజ్జ గ్రామానికి వచ్చిన #18000Crores రాజగోపాల్ రెడ్డిని #GoBack #RajGopalReddy అంటూ … Read more

    సీఎంపై మండిపడ్డ కిషన్ రెడ్డి

    కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసలైన ఫాసిస్ట్ కేసీఆర్ యేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో అన్ పార్లమెంటరీ పదాలను వాడుతున్నారన్నారని గుర్తుచేశారు. ఈటెల రాజేందర్ ని సమావేశాల నుంచి సస్పెండ్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సీఎంగా తొలుత కేసీఆర్ ఆదర్శంగా మాట్లాడాలని హితవు పలికారు. మోదీని గద్దె దించడం కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో ఉన్న ఎంపీ సీట్లను కూడా ప్రజలు ఊడ్చేస్తారని జోష్యం చెప్పారు. గవర్నర్ ప్రొటోకాల్ ని పాటించట్లేదని విమర్శించారు.

    బండి సంజయ్  పాదయత్రతోనే ఆపరేషన్ ఆకర్ష్.. లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి సహా మరికొందరు?

    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన, పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేపట్టారు. యాదాద్రి నుంచి చేపట్టిన ఈ పాదయాత్ర వరంగల్ భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది. ఈ యాత్ర భువనగిరి, వరంగల్ పార్లమెంట్ నియోజవర్గాల పరిధిలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది. 24 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర ఆగస్టు 26న వరంగల్ లో ముగియనుంది. ఈ పాదయాత్రనే వేదికగా చేసుకుని ఇతర పార్టీల కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునేలా … Read more

    భారీ పబ్లిసిటీ స్కెచ్ వేసిన TRS

    TRS పార్టీ భారీ పబ్లిసిటీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ స్కెచ్ తోనే బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. జూలై 2,3 వ తేదీల్లో నగరంలోని హైటెక్స్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానితో సహా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఈ సమయంలో పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. కానీ అందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా నగరంలోని మెజారిటీ మెట్రో … Read more

    Please make way for AAP and Kejriwal, who has arrived in national politics.

    With spectacular results in today’s ‘5 state elections,’ it is clear that the Aam Aadmi Party will play a significant role in national politicsArvind Kejriwal founded the AAP as an alternative to the BJP and Congress, and he became Delhi’s Chief Minister twice after winning state elections both times.. With its victory in Punjab and gains in Goa, the AAP … Read more