TRS పార్టీ భారీ పబ్లిసిటీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ స్కెచ్ తోనే బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. జూలై 2,3 వ తేదీల్లో నగరంలోని హైటెక్స్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానితో సహా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఈ సమయంలో పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. కానీ అందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా నగరంలోని మెజారిటీ మెట్రో పిల్లర్లను TRS బుక్ చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మూడు కారిడార్లలో కలిపి రెండున్నర వేలకు పైగా పిల్లర్లను TRS బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఎటూ పాలుపోలేని స్థితిలో పడిపోయింది. ఈ 8 సంవత్సరాల కాలంలో గులాబీ పార్టీ చేపట్టిన పథకాలను వీటి మీద ప్రదర్శించనున్నారు.
-
© File Photo
-
© File Photo
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్