• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థులు మార్పు

    తెలంగాణలో ఎన్నిక నామినేషన్ చివరి రోజు రెండు చోట్ల అభ్యర్థులను బీజేపీ మార్చింది. వేములవాడ, సంగారెడ్డి అభ్యర్థులను మార్పు చేసింది. అప్పటికి ప్రకటించి ఉన్న వారిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశమిచ్చింది. వేములవాడ అభ్యర్థిగా వికాస్‌రావు, సంగారెడ్డి అభ్యర్థిగా పులిమామిడి రాజును బీజేపీ ప్రకటించింది. టికెట్‌ ప్రకటించి బీఫామ్‌ ఇవ్వకపోవడంపై సంగారెడ్డి బీజేపీ నేత దేశ్‌పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఫామ్‌ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి హెచ్చరించారు.

    భాజపా నాలుగో జాబితా ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. తుది జాబితాను ఖరారు చేసింది. టికెట్‌ ఖరారైన అభ్యర్థులకు భాజపా ముఖ్యనేతలు ఇప్పటికే ఫోన్‌ చేసి సమాచారమందించారు. కంటోన్మెంట్‌-కృష్ణ ప్రసాద్‌, నాంపల్లి-రాహుల్‌ చంద్ర, శేరిలింగంపల్లి-రవికుమార్‌ యాదవ్‌, మల్కాజ్‌గిరి-రామచందర్‌రావు, పెద్దపల్లి-ప్రదీప్ కుమార్, మేడ్చల్-విక్రమ్ రెడ్డికి కేటాయించినట్టు భాజపా ఓ ప్రకటనలో తెలిపింది.

    ఆ మూడు పార్టీలు ఒకటే: కిషన్‌రెడ్డి

    TG: భారాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒకటేనని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. మన్మోహన్‌ హయాంలో కేసీఆర్‌ మంత్రిగా ఉన్నారని, తెరాస నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అమ్ముడు పోయే పార్టీ అని, భారాస కొనుగోలు చేసే పార్టీ అని విమర్శించారు. ఈ రెండూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కేటనన్నారు.

    BRS బీసీని సీఎం చేయగలదా?: సంజయ్

    తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేయగలరా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని దుయబట్టారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్‌ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం గెలిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించామని గుర్తుచేశారు. కేవలం బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా మంచి జరగాలని చెప్పారు.

    BRS ఎంపీ, ఎమ్మెల్యేల భద్రత పెంపు

    బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిన భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. తమకు కూడా భద్రత పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

    ‘ఎంపీపై దాడితో నాకు సంబంధం లేదు’

    TG: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని పేర్కొన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని గుర్తుచేశారు. దళిత బంధు రాలేదన్న కోపంతోనే నిందితుడు గటాని రాజు ఎంపీపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందనరావు తెలిపారు. రాజు ఫేస్‌బుక్‌ ఖాతాను పరిశీలిస్తే అతనికి కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.

    వాళ్లు సర్వేల్లో గెలిస్తే.. మేం ఎన్నికల్లో గెలుస్తాం: కవిత

    బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం ఎలక్షన్‌ స్టంట్‌ అని ఆరోపించారు. బీజేపీతో తమకు ఎలాంటి డీల్‌ లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కచ్చితంగా 95-105 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల్లో కాంగ్రెస్ గెలిస్తే.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్నారు. ఓబీసీల కుల గణన చేయడాన్ని కేంద్రం నిరాకరిస్తోందిని మండిపడ్డారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదని కవిత పేర్కొన్నారు.

    పార్టీలో అవమానాలు జరిగాయి: బాబూమోహన్

    బీజేపీ నేత బాబూ‌మోహన్ ఆ పార్టీపై తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని చెప్పారు. ‘అధిష్ఠానం నిర్ణయం మేరకు బీజేపీకి రాజీనామా చేస్తా. అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. పార్టీలో అవమానాలు జరిగాయి. నా ఆత్మాభిమానం దెబ్బతింది. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. కావాలనే నన్ను పార్టీకి దూరం పెట్టారు’. అని బాబూమోహన్ తెలిపారు.

    కాంగ్రెస్‌కు కేటీఆర్‌ బహిరంగ సవాల్‌

    వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. ‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భాజపా హామీ ఏమైంది?. కర్ణాటకను మోడల్‌గా కాంగ్రెస్‌ నేతలు చూపుతున్నారు. కర్ణాటక రైతులు రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వారికి మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చామని ఆరోపిస్తున్నారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం.. సిద్ధమా?’ అని కేటీఆర్‌ సవాలు విసిరారు. ⬆️ అటు రూరల్ డెవలప్‌మెంట్, ఇటు అర్బన్ … Read more

    కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు

    ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాలం చెల్లిన ఫోన్లు పని చేయవు వాటిని ఎన్ని సార్లు స్విచ్‌ఆన్ చేసినా బటన్లు నొక్కిన ఫలితం ఉండదు. కాంగ్రెస్‌ది కూడా ఇప్పడు అలాంటి పరిస్థితే. 2014లో కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నట్లు కాంగ్రెస్‌ను వదిలించుకున్నారు. ఈ దేశానికి సాయం చేసే గొప్ప అవకాశాన్ని మాకు కల్పించారు’ అని మోదీ చెప్పుకొచ్చారు.