• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీజేపీ రెండో జాబితా విడుదల

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీకి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. త్వరలోనే పూర్తిస్థాయి జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అయితే ప్లాన్ ప్రకారమే బీజేపీ రెండో జాబితాలో ఒక్క అభ్యర్థి పేరు మాత్రమే ప్రకటించిందని టాక్ నడుస్తోంది.

    మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దే: కవిత

    తెలంగాణలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తన పార్టీ వంద సీట్లలు గెలుస్తుందన్నారు. ‘కేసీఆర్‌ పథకాల సృష్టికర్త ఆయన ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీకి తెలంగాణలో డిపాజిట్లు కూడా రావు ఆ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌ను ఓడిస్తాం. ప్రజలు కాంగ్రెస్‌ గ్యారంటీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగాలేరు. ఆ పార్టీ కేవలం ప్రజలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది’. అని కవిత విమర్శించారు.

    ఈసారి గజ్వేల్‌‌లో జరిగేది అదే: ఈటల

    గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై బీజేపీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో బీజేపీ సమావేశాలకు రాకుండా బీఆర్‌ఎస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలోను వారు ఇదే చేశారని మండిపడ్డారు. అయినా అక్కడ బీజేపీనే గెలిచిందని చెప్పారు. ఈసారి గజ్వేల్‌లో కూడా అదే జరుగుతుందని ఈటల పేర్కొన్నారు.

    ఏపీ ప్రభుత్వంపై పురందేశ్వరి ఫైర్

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో కల్తీ మద్యం తయారవుతుందని ఆరోపించారు. ఆయా కంపెనీల ఆరోపణలపై సీఎం జగన్ ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాలతో జగన్ ప్రభుత్వం చలగాటం అడుతోందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రేపే అభ్యర్థులను ప్రకటిస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

    ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ భరిలో నిలిపేందుకు అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుందని చెప్పారు. దాన్ని రేపు అధిష్ఠానం విడుదల చేస్తుంది. ఆయా స్థానాల్లో ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందుకే ఎంపిక ఆలస్యం అయింది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నుంచి పార్టీలో చాలా మంది చేరుతున్నారు. నా సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేరిక విషయం నాతో మాట్లాడలేదు’. అని కోమటిరెడ్డి తెలిపారు.

    నేడు భాజపా అగ్రనేతలతో పవన్ భేటి

    తెలంగాణ ఎన్నికల వేళ భాజపాతో పొత్తు అంశంపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. భాజపా పెద్దలతో చర్చించనున్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ కూడా ఈ భేటిలో పాల్గొంటారని సమాచారం. ఇందులో GHMC సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని భాజపా నేతలు వ్యక్తపరుస్తున్నారు.

    భాజపాకు నటి గౌతమి రాజీనామా

    చెన్నై: భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి గౌతమి ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం లభించడం లేదని తెలిపారు. పైగా ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన వ్యక్తికి కొంతమంది సీనియర్‌ నేతలు అండగా నిలిచినట్లు ఆరోపించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇస్తానని చెప్పి మెుడిచెయ్యి చూపించారని గౌతమి అన్నారు. కాగా, స్థిరాస్తుల విషయంలో తనను అళగప్పన్‌ అనే వ్యక్తి మోసం చేశాడని ఇటీవల ఆమె పోలీసులకు … Read more

    భాజపా తొలి జాబితా విడుదల

    తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. 52 మందితో జాబితాను వెల్లడించింది. కరీంనగర్‌ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌ పోటీ చేయనున్నారు. గజ్వేల్‌, హుజూరాబాద్‌ రెండు స్థానాల నుంచి ఈటల రాజేందర్‌ బరిలో నిలవనున్నారు.

    ఆ పార్టీలకు అభ్యర్థులే లేరు: కేటీఆర్

    ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెప్పారు. కేసీఆర్‌‌పై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు. అభ్యర్థులకు బీఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్‌.. ఫలితాల్లోనూ ముందే ఉంటామని వెల్లడించారు. కాంగ్రెస్‌కు 40చోట్ల అభ్యర్థులు లేరని చెప్పారు, బీజేపీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని కేటీఆర్ జోష్యం చెప్పారు.

    ఆ మూడు పార్టీలు ఒక్కటే: రాహుల్

    తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటే, కేంద్రం బీఆర్‌ఎస్‌‌కు మద్దతు పలుకుతుంది. బీజేపీ నాపై 24 కేసులు పెట్టింది. మరి అదే బీజేపీ కేసీఆర్‌ మీద ఎన్ని కేసులు పెట్టిందో చెప్పాలి. కేసీఆర్‌ మీద సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు, చర్యలు ఉండవు దేశంలోనే అవినీతి సీఎం కేసీఆర్’ అని రాహుల్ ఆరోపించారు.