ఆసక్తికరమైన అప్డేట్ పంచుకున్న ధృవ్ విక్రమ్
తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు, నటుడు ధృవ్ విక్రమ్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. తన ట్రాక్ 1 అధికారిక మ్యూజిక్ వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఓ ప్రోమోను విడుదల చేశాడు. ఈ మ్యూజిక్ వీడియోలో ధృవ్, ఉజ్వల్ గుప్తా పాడి నటించినట్లు తెలుస్తోంది. ‘మహాన్’ విజయం తరువాత ఎలాంటి సినిమాలు ఒప్పుకొని ధృవ్.. కథలను వింటున్నాడు. ఈ క్రమంలోనే మ్యూజిక్ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది.