దుబాయ్‌లో ఫ్యామిలీతో పుష్ప డైరెక్టర్
పుష్ప2 సినిమాతో ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యలో దొరికిన కాస్త బ్రేక్‌ని కుటుంబంతో సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ మేరకు ఫ్యామిలీతో కలిసి సుకుమార్ దుబాయ్ ఎడారుల్లో కనిపించాడు. నూతన సంవత్సర వేడుకలను అక్కడే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. గతేడాది విడుదలైన పుష్ప సినిమా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ ఫిల్మ్‌ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు.